Viral Video: ఆడుకుంటున్న చిన్నోడి ముందుకు వచ్చిన గిరి నాగు.. ఆ తర్వాత
ఈ వీడియో చూసిన నెటిజన్లు భీతిల్లుతున్నారు. అంత ప్రమాదకర పాము ముందు పిల్లాడిని వదిలేసిన పేరెంట్స్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోరలు తీసిన పాము అయినా.. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.
ఒక చిన్న పిల్లోడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ పాము విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. నిమిషాల్లో ఒక వ్యక్తిని చంపగలదు. ఇలాంటి డేంజరస్ స్నేక్‌తో ముందు పిల్లోడు ఒంటరిగా ఉండటం చూసి.. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చూసిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అజాగ్రత్తగా వ్యవహరించిన తల్లిదండ్రులను జైలులో పెట్టాలని కామెంట్స్ పెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో, కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లవాడు కింగ్ కోబ్రా దగ్గర ముందు కూర్చుని పదేపదే దాని పడగ తాకడాన్ని మీరు చూడొచ్చు. అదే సమయంలో, పాము కూడా పిల్లోడి నుంచి పాము పక్కకి తప్పుకోడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము కాటు వేసేందుకు మాత్రం కాటు వేసే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @lola_clips పేరుతో ఉన్న పేజీ నుంచి షేర్ చేశారు. దీనిపై ప్రజల నుండి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డను ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచిన పేరెంట్స్‌ను జైల్లో పెట్టాలని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరొకొంతమంది ఇది ఎడిట్ చేసిన వీడియో అని చెబుతున్నారు. అయితే ఈ పాము కోరలు తొలగింగి ఉంటారని.. అందుకే అలా వదిలేసి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. <
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..