Watch! తనని కాటు వేసిన పాముని ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఆస్పత్రిలో గందరగోళం..
మన దేశంలో పాము కాటు ప్రమాదం ఎక్కువగా వర్షాకాలంలో నే అది కూడా పల్లెల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. పాము కరచినప్పుడు సమయానికి తగిన చికిత్స అందక పొతే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక యువకుడు తనని కాటు వేసిన పాముని పట్టుకుని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకుని వచ్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
భూమి మీద విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ప్రపంచం మొత్తం మీద వందల రకాల పాములు నివసిస్తున్నాయి. ఈ పాముల్లో కొన్ని విషపూరితమైనవి కాగా మరికొన్ని విషయం లేనివి. అయినప్పటికీ పాము కనిపిస్తే చాలు.. అవి ఏ రకమైనవి అయినా సరే వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వీలైంత దూరం పెరిగేడతారు కూడా.. అయితే కొన్ని సార్లు పాము కాటుకు మనుషులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అయితే పాములకు విషం అనేది ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రధాన ఆయుధం. కనుక విషాన్ని అవి చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాయి. తమకు ప్రాణ హాని ఉందని భావించినప్పుడు.. తప్పించుకోవడానికి వేరే దారి ఏదీ కనిపించనప్పుడు మాత్రమే పాము మనిషిని కాటు వేస్తుందని.. పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయితే మన దేశంలో పాము కాటు ప్రమాదం ఎక్కువగా వర్షాకాలంలో నే అది కూడా పల్లెల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. పాము కరచినప్పుడు సమయానికి తగిన చికిత్స అందక పొతే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక యువకుడు తనని కాటు వేసిన పాముని పట్టుకుని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకుని వచ్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ఓ యువకుడిని పాము కాటు వేసింది. అయితే ఆ యువకుడు చికిత్స నిమిత్తం ఆసపత్రికి వస్తూ తనతో పాటు తనని కాటు వేసిన పామును తీసుకుని వచ్చాడు. దీంతో ఆ ఆసుపత్రిలో నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ సంచిలో పాముని చూసిన ఆస్పత్రి సిబ్బందిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పాముని ఒక్కసారిగా చూడడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
चंदौली में हैरान करने का मामला आया सामने
युवक को अचानक सांप ने काटा
युवक सांप को मारकर थैले में भरकर पहुंचा जिला अस्पताल
युवक को सांप सहित देख मचा हड़कंप
युवक का प्राथमिक इलाज कर चिकित्सकों ने भेजा घर@chandaulipolice @Uppolice #Chandauli pic.twitter.com/QAeaIkMwKa
— News1India (@News1IndiaTweet) August 12, 2024
వైద్యులు, నర్సులు భయంతో తమ భద్రత కోసం అటు ఇటు గాలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఊహించని రీతిలో పాము కనిపించడంతో ఆస్పత్రిలో జరగాల్సిన సాధారణ కార్యకలాపాలకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. అయితే అలా యువకుడు ఇలా పాముని తీసుకుని రావడానికి కారణం.. తనను కాటు వేసిన పాము రకాన్ని వైద్యులు తెలుసుకుని అందుకు తగిన చికిత్సనందిస్తారు అని భావించి ఉండవచ్చు అని అంటున్నారు నెటిజన్లు..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..