Monkeypox: మానవాళికి మరో వైపు ముప్పు పొంచి ఉందా..! మంకీపాక్స్ వైరస్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO
కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు పెరిగాయి. ఆ సమయంలో ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరప్ లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తరువాత WHO ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్‌ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ.. క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది.
కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మానవాళిపై మరో వైరస్ పంజా విసరడానికి రెడీగా ఉంది. మంకీపాక్స్ వైరస్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధి ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించడం గత రెండేళ్లలో ఇది రెండోసారి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. బుధవారం WHO సమావేశంలో ఈ ప్రకటన చేసింది. దీని తరువాత మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించబడింది. మంకీపాక్స్ కేసులు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు పెరిగాయి. ఆ సమయంలో ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరప్ లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తరువాత WHO ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్‌ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ.. క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది.
మంకీపాక్స్ అంటే ఏమిటి?
మంకీపాక్స్ అనేది కోతుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. రక్షణ లేకుండా శారీరక సంబంధాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన తర్వాత జ్వరం వస్తుంది. శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. శరీరమంతా వ్యాపిస్తాయి. మొట్టమొదట దద్దుర్లు ముఖం మీద కనిపిస్తాయి. తరువాత శరీరం మొత్తం వ్యాపిస్తాయి. స్వలింగ సంపర్క పురుషులలో మంకీపాక్స్ ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కూడా మొదట ఆఫ్రికాలో మొదలైంది.
మళ్లీ ప్రమాదం వస్తుందా?
మంకీపాక్స్ వైరస్ మళ్లీ యాక్టివ్‌గా మారిందని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని ఇన్ఫెక్టివిటీ రేటు కోవిడ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ.. ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎందుకంటే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల క్రితం కూడా వ్యాపించింది. అటువంటి పరిస్థితిలో మళ్లీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధికి నివారణ ఉందా?
మంకీపాక్స్ సోకిన రోగులు కూడా ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. వ్యాధి లక్షణాల ఆధారంగా రోగికి చికిత్స అందిస్తారు. ఈ వ్యాధికి టీకా లేదా తగిన ఔషధం లేనందున, రోగికి ఉన్న లక్షణాలను నియంత్రించడానికి చికిత్స అందించబడుతుంది
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..