AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2024: పాకిస్తాన్‌ కొత్త కుట్ర.. స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్‌.. సరిహద్దులపై సైన్యం డేగకన్ను

దోడాలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆర్మీతో పాటు జమ్ముకశ్మీర్‌ పోలీసులు భారీ కూంబింగ్‌ చేపట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్ సింగ్ అమరుడయ్యారు. దీపక్ సింగ్ 48 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారు.. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సైతం మరణించినట్లు సమాచారం. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం తనిఖీలు నిర్వహించింది. స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దులపై డేగకన్ను పెట్టింది సైన్యం.

Independence Day 2024: పాకిస్తాన్‌ కొత్త కుట్ర.. స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్‌.. సరిహద్దులపై సైన్యం డేగకన్ను
Jammu And Kashmir
Surya Kala
|

Updated on: Aug 15, 2024 | 1:06 PM

Share

తమ దేశ అభివృద్ధి, ప్రజలకు సుఖ సంతోషాలు ఇచ్చే పాలన కంటే భారత్ ని ఇబ్బంది పెట్టడానికే ఎక్కువగా ఇస్తాపడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం.. ఇప్పటికే జమ్ము కష్మీర్ లో పాత పాట పాడుతున్న ఆక్కడ ప్రభుత్వం.. ఓ వైపు ఈ రోజు స్వాతంత్య దినోత్సవ వేడుకలు.. మరోవైపు త్వరలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో కొత్త కుట్రలకు తెర లేపుతోంది. అవును జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియను భగ్నం చేయడానికి పాకిస్తాన్‌ కొత్త కుట్రలు చేస్తోంది. ఉగ్రదాడులను రెట్టింపు చేయడానికి టెర్రర్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేసింది. దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్‌సింగ్‌ అమరుడయ్యారు.

జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ కొత్త కుట్రలు బయటపడుతున్నాయి.. త్వరలో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు పాకిస్తాన్‌ స్కెచ్‌ గీసింది. కశ్మీర్‌లో శాంతిని భగ్నం చేయడానికి టెర్రర్‌ కేబినెట్‌ను నియమించింది పాకిస్తాన్‌ ప్రభుత్వం.. ఈ కుట్రలో భాగంగానే జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరిగాయి. టెర్రర్‌ కేబినెట్‌లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక బాధ్యతను అప్పగించారు. ఐఎస్‌ఐ సహకారంతో ఈ కుట్రలను అమలు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలపై పరిస్థితిపై కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి నివేదికను అందచేసింది.

వచ్చే వారం కశ్మీర్‌లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే పాకిస్తాన్‌ కొత్త కుట్రలకు తెరతీసింది. గతంలో ఉగ్రవాదం జాడ లేని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. దోడాలో ఎన్‌కౌంటర్‌ ఇందుకు నిదర్శనం. దోడాలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆర్మీతో పాటు జమ్ముకశ్మీర్‌ పోలీసులు భారీ కూంబింగ్‌ చేపట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్ సింగ్ అమరుడయ్యారు. దీపక్ సింగ్ 48 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారు.. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సైతం మరణించినట్లు సమాచారం. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం తనిఖీలు నిర్వహించింది. స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దులపై డేగకన్ను పెట్టింది సైన్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..