UGC NET 2024 Exam Date: యూజీసీ- నెట్‌ పరీక్ష రీషెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. కొత్త తేదీలు ప్రకటించిన ఎన్‌టీఏ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌ జూన్‌ 2024) పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున..

UGC NET 2024 Exam Date: యూజీసీ- నెట్‌ పరీక్ష రీషెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. కొత్త తేదీలు ప్రకటించిన ఎన్‌టీఏ
UGC NET 2024 Exam Date
Follow us

|

Updated on: Aug 15, 2024 | 7:27 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 15: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌ జూన్‌ 2024) పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకృష్ణజన్మాష్టమి కారణంగా ఆగస్టు 26వ తేదీన సెలవు వచ్చింది. దీంతో ఈ రోజున జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి, పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేసింది. ఆగస్టు 26వ తేదీన నిర్వహించవల్సిన ఆ పరీక్షను ఆగస్టు 27న నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో జరగనున్నాయి.

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రతీయేట యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలి విడతలో విడుదల చేసిన నెట్‌ నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 9,08,580 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీన మొత్తం 1,200 కేంద్రాలలో పెన్ను, పేపర్‌ విధానంలో పరీక్ష కూడా నిర్వహించారు. అయితే పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్‌ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమైంది. దీంతో నెట్‌ పరీక్షను యూజీసీ రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.

యూజీనీ నెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో జరుగుతుంది.రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

UGC- NET June 2024 అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

యూజీసీ-నెట్‌ 2024 పరీక్ష రీషెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..కారణం ఇదే
యూజీసీ-నెట్‌ 2024 పరీక్ష రీషెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..కారణం ఇదే
పాకిస్తాన్‌ కొత్త కుట్ర స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్
పాకిస్తాన్‌ కొత్త కుట్ర స్వాతంత్రదినోత్సవ వేళ కశ్మీర్‌లో హైఅలర్ట్
కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే
కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే
ఆగస్టు నెలాఖరుకు DSC తుది కీ విడుదల..1:3 నిష్పత్తిలో మెరిట్
ఆగస్టు నెలాఖరుకు DSC తుది కీ విడుదల..1:3 నిష్పత్తిలో మెరిట్
హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీ, కర్నాటకకు వెళ్తున్నాయా..?
హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీ, కర్నాటకకు వెళ్తున్నాయా..?
త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి వారికి లాభదాయకం
త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి వారికి లాభదాయకం
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల
దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు..
దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు..
Horoscope Today: డబ్బు విషయంలో ఆ రాశి వారు ఎవరికీ హామీలు ఉండొద్దు
Horoscope Today: డబ్బు విషయంలో ఆ రాశి వారు ఎవరికీ హామీలు ఉండొద్దు
వాటర్‌ గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్‌లో
వాటర్‌ గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్‌లో
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..