TG DSC 2024 Result Date: ఆగస్టు నెలాఖరుకు డీఎస్సీ తుది కీ విడుదల.. 1:3 నిష్పత్తిలో ఫైనల్ సెలక్షన్‌

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది..

TG DSC 2024 Result Date: ఆగస్టు నెలాఖరుకు డీఎస్సీ తుది కీ విడుదల.. 1:3 నిష్పత్తిలో ఫైనల్ సెలక్షన్‌
TG DSC 2024 Result Date
Follow us

|

Updated on: Aug 15, 2024 | 7:02 AM

హైదరాబాద్‌, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది పరీక్షలకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులకు 92.10 శాతం హాజరు నమోదైంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్‌ ఆన్సర్‌ కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరుకు తుది ఆన్సర్‌ కీ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది.

మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్‌ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఈసారి డీఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్‌ కీ విడుదలైన రోజే లేదంటే ఆ మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అనంతరం వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించి మెరిట్ జాబితా వెల్లడిస్తారు. రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్‌ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్‌ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలను పంపించేలా కార్యచరణ రూపిందిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

ఒక వేళ ఇదంతా అనుకున్నట్లు జరగకపోతే అక్టోబర్‌ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని విశ్వాస వర్గాలు తెలిపాయి. మొత్తం చూస్తే అక్టోబర్‌ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటికీ షెడ్యూ ల్డ్‌ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్‌ కూడా తెస్తామన్నారు. అయితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకర ణపై తీర్పు రాక ముందే ఇచ్చారు గనుక ఈ నియామకాలకు వర్గీకరణ అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ ప్రభుత్వం వర్గీకరణ అంశంపై స్పందిస్తే ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..