Ketu And Venus Conjunction: త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి ఉద్యోగులకు ప్రయోజనకరం..

జ్యోతిష్యశాస్త్రంలో సంపాదన ప్రేమ తెలివితేటలకు శుక్రగ్రహం కారకుడు. త్వరలో శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ నెల 25వ తేదీన సింహ రాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే గత ఏడాది నుంచి కన్య రాశిలో సంచరిస్తున్నాడు కేతు గ్రహం. దీంతో కన్య రాశి వేదికగా కేతు శుక్రుడు కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 9 నెలల తర్వాత జరాగానుంది. దీంతో ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు.. కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండనుందని చెబుతున్నారు.

Ketu And Venus Conjunction: త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి ఉద్యోగులకు ప్రయోజనకరం..
Ketu And Venus Conjunction
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2024 | 6:49 AM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. వీటి ఫలితంగానే మనిషి జాతకంలో మంచి, చెడులను నిర్ణయిస్తాయని నమ్మకం. జాతకంలో గ్రహస్థానాలు జీవితంలో ఏర్పడే పరిస్థితులపై ప్రభావాన్ని చూపిస్తాయి. నవ గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. జ్యోతిష్యశాస్త్రంలో సంపాదన ప్రేమ తెలివితేటలకు శుక్రగ్రహం కారకుడు. త్వరలో శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ నెల 25వ తేదీన సింహ రాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే గత ఏడాది నుంచి కన్య రాశిలో సంచరిస్తున్నాడు కేతు గ్రహం. దీంతో కన్య రాశి వేదికగా కేతు శుక్రుడు కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 9 నెలల తర్వాత జరాగానుంది. దీంతో ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు.. కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండనుందని చెబుతున్నారు.

కన్యారాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కేతు, శుక్ర గ్రహాల కలయిక శుభప్రదంగా ఉండనుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో శుభ స్థానంలో జరగనుంది. దీంతో డబ్బుల సంబధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనవంతులు అయ్యే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈ నెలలో కన్య రాశిలో కేతు తో పాటు శుక్రుడు అడుగు పెట్టడం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ప్రేమ సంబంధిత సమస్యల నుంచి బయటపడి భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడులు లభిస్తాయి. ఊహించని విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇప్పటి వరకూ రాని బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మకర రాశి: కేతు, శుక్ర గ్రహాల కలయిక ఈ రాశికి శుభ ప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కలయిక వలన కెరీర్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో చాలా శుభప్రదంగా సాగనుంది. అదే విధంగా కొత్త పెట్టుబడులను పెట్టె విషయంలో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ప్రయోజన కరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.