AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య రామయ్యను వదలని దొంగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ.. విలువెంతో తెలిస్తే..!

రామ్‌పథ్‌లోని చెట్లపై అమర్చిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరీకి గురైనట్లు ఆల‌య ట్ర‌స్టు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి. వీటి విలువ సుమారు..

అయోధ్య రామయ్యను వదలని దొంగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ.. విలువెంతో తెలిస్తే..!
Ayodhya Ram Temple
Jyothi Gadda
| Edited By: |

Updated on: Aug 15, 2024 | 6:39 AM

Share

ఆలయాల పట్టణం అయోధ్య రామాల‌య నిర్మాణం అనంత‌రం మందిర ప‌రిస‌ర ప్రాంతాల‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేసింది. భ‌క్తిప‌థం, రామ‌ప‌థం మార్గాల్లో వెదురు స్తంభాల‌తో కూడిన లైట్ల‌ను ఏర్పాటు చేసింది. వాటిలో 3,800 వెదురు స్తంభాల లైట్ల‌ను, 36 గోబో ప్రొజెక్ట‌ర్ లైట్ల‌ను దుండ‌గులు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.50ల‌క్షల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. ఆల‌య ట్ర‌స్టు పోలీసుల‌కు ఈ నెల 9న ఫిర్యాదు చేయ‌గా, తాజాగా ఇది వెలుగులోకి వ‌చ్చింది. ఈ మేర‌కు అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఫిర్యాదు చేశారు.

రామ్‌పథ్‌లోని చెట్లపై అమర్చిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరీకి గురైనట్లు ఆల‌య ట్ర‌స్టు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం రామ్‌పథ్‌లో 6,400 వెదురు లైట్లు, భక్తి ప‌థంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. “మార్చి 19 వరకు అన్ని లైట్లు ఉన్నాయి. కానీ మే 9 న తనిఖీ తర్వాత కొన్ని లైట్లు కనిపించలేదు. ఇప్పటి వరకు 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో గుర్తుతెలియని దుండ‌గులు దొంగిలించారు” అని శేఖర్ శర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయోధ్యను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన పథకం కింద మఠం-ఆలయంతోపాటు ప్రధాన రహదారుల వెంట ఆకర్షణీయమైన దీపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రదేశాల్లోని ఈ అందాలను చూసి దొంగలు ఎప్పుడు, ఎలా వెళ్లారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రామపథం, భక్తిపథం మార్గాల్లో లైట్లను అమర్చే కాంట్రాక్టును  యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్‌కు ఇచ్చింది. దీని కింద నయా ఘాట్, హనుమాన్ గర్హి, తేధి బజార్‌లో సుమారు 6400 వెదురు, 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశారు. యష్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి శేఖర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపత్ మరియు భక్తిపై నాటిన 3800 వెదురులతో పాటు 36 గోబో లైట్లు చోరీకి గురయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న బిల్‌గేట్స్ విమానం
విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న బిల్‌గేట్స్ విమానం
పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?
పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?
వాట్సప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండిలా.. సెకన్లలోనే..
వాట్సప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండిలా.. సెకన్లలోనే..
అందం కోసం అదరిపోయే చిట్కా.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
అందం కోసం అదరిపోయే చిట్కా.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం వీడియో
శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం వీడియో
మీ ఫోన్‌తో బంగారం, వెండి స్వచ్ఛతను తనిఖీ చేయండి ఇలా..!
మీ ఫోన్‌తో బంగారం, వెండి స్వచ్ఛతను తనిఖీ చేయండి ఇలా..!
అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు
అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు
శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..? ఈ ఆయుర్వేద..
శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..? ఈ ఆయుర్వేద..
ఉద్యోగుల కోసం స్వర్ణోత్సవం.. గోల్డ్‌తో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..1
ఉద్యోగుల కోసం స్వర్ణోత్సవం.. గోల్డ్‌తో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..1
శివరాత్రి వేళ ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లారు.. కాసేపటికి..
శివరాత్రి వేళ ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లారు.. కాసేపటికి..