Rakhi 2024: ఈ ఏడాది రాఖీ రోజున అరుదైన యోగాలు.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం.. బ్లూ మూన్ దృశ్యం..

ఈ సంవత్సరం శ్రావణ సోమవారం పౌర్ణమి తిధిలో రాఖీ పండగ వస్తుంది. ఈ రోజున శ‌శ రాజ్య యోగం, బుధాదిత్య రాజ‌యోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, విష రాజయోగం, కుబేర యోగం వంటి అద్భుతమైన కలయికలు రూపొందుతున్నాయి. అందుకే ఈ ఏడాది రాఖీ పండగను చాలా ప్రత్యేకంగా జ్యోతిష్యులు భావిస్తున్నారు.

Rakhi 2024: ఈ ఏడాది రాఖీ రోజున అరుదైన యోగాలు.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం.. బ్లూ మూన్ దృశ్యం..
Blue Moon On Rakhi Day
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2024 | 7:50 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హిందువులు జరుపుకునే పండగలలో రాఖీ పండగ చాలా ముఖ్యమైన పండగ. అయితే ఈ ఏడాది రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈ రోజున బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది. దీనితో పాటు జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు కూడా ఈ రోజున సృష్టించబడుతున్నాయి. ఇన్ని విశేష యాదృచ్ఛికాల వల్ల రక్షాబంధన్ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది సోదర సోదరీమణుల పవిత్ర పండుగ రాఖీ పండగను ఆగస్టు 19న జరుపుకోనున్నారు.

బ్లూ మూన్ అంటే ఏమిటి?

చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అంటారు. ఈ స్థితిలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతేకాదు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు.

ఇవి కూడా చదవండి

బ్లూ మూన్‌లో చంద్రుడు ఏ రంగులో నీలంగా కనిపిస్తాడు?

బ్లూ మూన్ అనే పేరు వినగానే అందరిలోనూ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. బ్లూ మూన్ వచ్చినప్పుడు.. చంద్రుని రంగు నీలం రంగులో కనిపిస్తాడా.. అందుకే దానిని బ్లూ మూన్ అని పిలుస్తారా? అని అనుకుంటారు. అయితే బ్లూ మూన్ అంటే చంద్రుని రంగు నీలంలో కనిపించడం కాదు. ఈ సమయంలో కూడా చంద్రుడు సహజ రంగులో ఉంటాడు. అయితే ఈ రోజు మాత్రమే చంద్రుడు పెద్ద పరిమాణంలో, మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ దృగ్విషయాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఆకాశంలో జరిగే అరుదైన దృగ్విషయం. దీనికి క్యాలెండర్ ప్రకారం పేరు ఈ పేరు పెట్టారు.

ఏ సమయంలో ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుంది

ఆగస్ట్ 19వ తేదీ రాఖీ పండగ రోజు చంద్రోదయం సాయంత్రం 6:56 గంటలకు సంభవిస్తుంది. మర్నాడు ఉదయం చంద్రాస్తమయం జరుగుతుంది. రాత్రి 11:55 గంటలకు చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అదే రోజు చంద్రదేవుడు మకరరాశి నుంచి బయలుదేరి సాయంత్రం 6:59 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రాఖీ రోజున అద్భుతమైన యాదృచ్చికలు

ఈ సంవత్సరం శ్రావణ సోమవారం పౌర్ణమి తిధిలో రాఖీ పండగ వస్తుంది. ఈ రోజున శ‌శ రాజ్య యోగం, బుధాదిత్య రాజ‌యోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, విష రాజయోగం, కుబేర యోగం వంటి అద్భుతమైన కలయికలు రూపొందుతున్నాయి. అందుకే ఈ ఏడాది రాఖీ పండగను చాలా ప్రత్యేకంగా జ్యోతిష్యులు భావిస్తున్నారు.

ఈ రాశుల వారి అదృష్టం రక్షాబంధన్ రోజు నుండి ప్రకాశిస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రక్షా బంధన్ రోజున సంభవించే ప్రత్యేక యాదృచ్ఛికాల కారణంగా 6 రాశుల వారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఈ రాఖీ పండగ నుంచి మేషం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఊహించని ధనలాభాలు పొందే సూచనలున్నాయి. వీరు కెరీర్‌లో ప్రమోషన్ పొందవచ్చు. కొన్ని రాశుల ఉద్యోగస్తుల జీతం కూడా పెరగవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు