Saturn Transit 2024: తిరోగమనంలో శనీశ్వరుడు.. కుంభరాశితో సహా ఈ 3 రాశుల వారు పొరపాటున ఈ పని చేయకూడదు
శనిశ్వరుడి ప్రభావం వ్యతిరేక దిశలో ప్రయాణించే సమయంలో గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో మీన, కుంభ, మకర రాశులకు చెందిన వారికి ఏలి నాటి శని ప్రభావం కొనసాగుతుంది. అంతేకాదు వృశ్చికం, కర్కాటకంపై శని దోష ప్రభావం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆర్థిక పరిస్థితితో పాటు, కుటుంబ వాతావరణంలో కూడా విబేధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు ప్రారంభించకూడదు.
నవ గ్రహాల్లో శనీశ్వరుడిని కర్మ ప్రదాతగా, న్యాయ దేవుడు అని పిలుస్తారు. మంచి చెడుల కర్మలకు అనుగుణంగా శిక్షలను విధిస్తాడు. మొత్తం తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు అత్యంత ఆగ్రహం కలిగిన, శక్తివంతమైన గ్రహంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిశ్వరుడు తన సొంత రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శనీశ్వరుడు వ్యతిరేక దిశలో సంచరించినప్పుడు.. అతని ప్రభావం గణనీయంగా పెరుగుతుందని నమ్ముతారు. దీన్నే శని తిరోగమనం అని కూడా అంటారు. ఇలా శనీశ్వరుడు తిరోగమనంలో 92 రోజుల పాటు ఉండనున్నాడు. తర్వాత నవంబర్ 15న కుంభరాశి వైపు కదలునున్నాడు.. శనిశ్వరుడి తిరోగమన సమయంలో శనిశ్వరుడికి నచ్చని ఏ పనిని చేయకూడదు.
ఏ రాశిచక్ర గుర్తులు ప్రభావితమవుతాయి?
శనిశ్వరుడి ప్రభావం వ్యతిరేక దిశలో ప్రయాణించే సమయంలో గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో మీన, కుంభ, మకర రాశులకు చెందిన వారికి ఏలి నాటి శని ప్రభావం కొనసాగుతుంది. అంతేకాదు వృశ్చికం, కర్కాటకంపై శని దోష ప్రభావం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆర్థిక పరిస్థితితో పాటు, కుటుంబ వాతావరణంలో కూడా విబేధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు ప్రారంభించకూడదు.
పొరపాటున కూడా ఇలా చేయకండి
శనిశ్వరుడి న్యాయాన్ని ప్రేమించే దేవుడిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో శనిశ్వరుడి తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయడం వలన శనిశ్వరుడికి ఆగ్రహం కలగవచ్చు. అత్యాశ, అసూయకలిగిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వృద్ధులను అవమానించకూడదు. అంతేకాదు శరీరంపై నియంత్రణను నిర్వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. పరుషమైన మాటలు మాట్లాడేవారిని శనిదేవుడు ఎప్పుడూ శిక్షిస్తాడు. ఈ సమయంలో జంతువులు, పక్షులు, ఋషులు, సాధువులు, తల్లిదండ్రులు మొదలైన వారిని పూజించాలి.
శని తిరోగమన సమయంలో ఈ పని చేయండి
శనిదేవుని తిరోగమన సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. ఒక ఇనుప గిన్నెలో ఆవాల నూనె నింపిన తర్వాత.. అందులో మీ ముఖం చూసుకుని తర్వాత గిన్నెతో పాటు ఆ నూనెను దానం చేయాలి. ఈ సమయంలో సుందర కాండ లేదా హనుమాన్ చాలీసాను పఠించండి. శనిశ్వరుడి తిరోగమన సమయంలో ఇనుము, మినుములు, ఆవాల నూనె. నల్ల నువ్వులు, నల్ల బట్టలు, దుప్పట్లు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు