Viral Video: పిచ్చి ముదిరింది.. రీల్స్ కోసం లైఫ్ రిస్క్‌లో పెట్టి మరీ..

పైత్యం పెరిగిపోతుంది. సోషల్ మీడియా రీల్స్ పిచ్చలో కొందరి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు రిస్క్‌లో పెట్టి మరీ.. వ్యూస్, లైక్స్ కోసం వెంపర్లాడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్నారు.

Viral Video: పిచ్చి ముదిరింది.. రీల్స్ కోసం లైఫ్ రిస్క్‌లో పెట్టి మరీ..
Deadly Stunt
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2024 | 9:25 AM

ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు. ఈ మధ్య ఇలా పిచ్చి పైత్యపు పనులు చేసి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తాజాగా  కదులుతున్న ట్రక్కు వెనుక ఇద్దరు అబ్బాయిలు స్కేటింగ్ స్టంట్ చేస్తున్న భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కేట్‌బోర్డు ధరించిన ఇద్దరు అబ్బాయిలు వేగంగా వెళ్తున్న ట్రక్కు వెనుక భాగంలో వేలాడుతూ వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగినట్లు సమాచారం.

వైరల్‌గా మారిన వీడియోలో, ఒక బాలుడు స్కేటింగ్ చేస్తూ, ట్రక్కు వెనుక పట్టుకుని, మరొకడు ఆ ట్రక్ పట్టుకుని వెళ్తూ వీడియో షూట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో ఆగస్టు 12న @Ruksar_Khan7 అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది . ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య అని చాలా మంది వ్యాఖ్యానించారు. ఈ అబ్బాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మీకు పేరెంట్స్ ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. వారికి కడుపు కోత మిగిలేలా ఇలాంటి ప్రమాదకర పనులు చేయకండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..