ISRO SSLV-D3: మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ.. ఇస్రో SSLV-D3 రాకెట్‌ ప్రత్యేకతలు ఇవే..

శ్రీహరికోట షార్‌లో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా E.O.S-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. భూపరిశీలన ఈ మిషన్‌ టార్గెట్‌.. మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ- MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమాయానికే ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు.

ISRO SSLV-D3: మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ.. ఇస్రో SSLV-D3 రాకెట్‌ ప్రత్యేకతలు ఇవే..
ISRO SSLV-D3
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2024 | 9:41 AM

శ్రీహరికోట షార్‌లో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా E.O.S-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. భూపరిశీలన ఈ మిషన్‌ టార్గెట్‌.. మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ- MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమాయానికే ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. రేపు నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు ఉంటుందని తెలిపారు. మైక్రోసాటిలైట్‌ను అభివృద్ధి చేయడం, భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో.. రాకెట్ లను ప్రయోగిస్తూ అంతరిక్షరంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది. SSLV-D3 ప్రయోగాన్ని ఇవాళే చేపట్టాల్సి ఉన్నా.. అనివార్యకారణాల వల్ల రేపటికి వాయిదా వేశారు.

ఈ రాకెట్‌ ప్రయోగాన్నిను ఇండియన్‌ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగిస్తోంది. రాకెట్‌ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు. ప్రయోగాన్ని చూసేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

రాకెట్‌ ప్రయోగానికి ఇవాళ్టి నుంచే కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్‌ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్‌ను రూపొందించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో సైంటిస్టులు..

తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు ఇస్రో సైంటిస్టులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల వేదాశీర్వచనం పొందారు. రేపు సతీశ్‌ ధావన్‌ సెంటర్‌ నుంచి జరిగే SSLV D3 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ కావాలని దేవుణ్ని కోరుకున్నారు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!