AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Gemini: 200 దేశాలు.. 45 భాషలు.. గూగుల్ జెమినీ ఏఐకి లేదు పోటీ..

ప్రపంచ టెక్ జెయింట్ గూగుల్ కూడా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి తరం ఏఐ అసిస్టెంట్- జెమినీని పరిచయం చేసింది. ఇది ఇప్పుడు 200 దేశాల్లో 45 భాషలను సపోర్టు చేస్తుందని గూగుల్ ప్రకటించింది. దీనిని ఇటీవల జరిగిన గూగుల్ గ్లోబల్ ఈవెంట్ మేడ్ బై గూగుల్ లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ తో గ్లోబల్ వైడ్ గా ఏఐని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది.

Google Gemini: 200 దేశాలు.. 45 భాషలు.. గూగుల్ జెమినీ ఏఐకి లేదు పోటీ..
Google Gemini Ai
Madhu
|

Updated on: Aug 15, 2024 | 2:52 PM

Share

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించి మార్కెట్లో పోటీ వాతావరణం ఉంది. టెక్ దిగ్గజాలు ఒకదానికొకటి పోటీ పడి మరి ఏఐ టూల్స్ ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ టెక్ జెయింట్ గూగుల్ కూడా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి తరం ఏఐ అసిస్టెంట్- జెమినీని పరిచయం చేసింది. ఇది ఇప్పుడు 200 దేశాల్లో 45 భాషలను సపోర్టు చేస్తుందని గూగుల్ ప్రకటించింది. దీనిని ఇటీవల జరిగిన గూగుల్ గ్లోబల్ ఈవెంట్ మేడ్ బై గూగుల్ లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ తో గ్లోబల్ వైడ్ గా ఏఐని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది. కేవలం ఇంగ్లిష్ మాట్లాడే వారి మార్కెట్ మాత్రమే కాక.. ఇప్పుడు ఇది మిగిలిన ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

యాపిల్ మాదిరి కాకుండా..

గూగుల్ యాపిల్ మాదిరి కాకుండా గ్లోబల్ వైడ్ ఉన్న వినియోగదారులకు తమ సేవలు అందించేందుకు ప్రణాళిక చేస్తోందని గూగుల్ లోని ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ ప్రెసిడెంట్ సమీర్ సమత్ చెప్పారు. జెమినీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందని.. కానీ ఇంగ్లిస్ మాట్లాడే వారికి మాత్రమే వినియోగించుకొని వీలుందని.. కానీ ఇప్పుడు ఏకంగా 45 భాషలకు సపోర్టు చేస్తుండటంతో ఏఐ మరింత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందని పేర్కొన్నారు. యాపిల్ సంస్థ కొత్త ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది. ఇది ప్రారంభంలో యూఎస్ కి మాత్రమే పరిమితం చేసి ఉంచారు. అయితే ఆ తర్వాత ఆంగ్లం మాట్లాడే వారికందరికీ అందుబాటులో ఉంచింది.

భాషతో సంబంధం లేకుండా విస్తరణ..

ఇప్పుడు గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ 45 భాషలకు మద్దతు అందిస్తుండటంతో దీని రీచ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా వినియోగదారులందరికీ అధునాతన ఏఐని అందుబాటులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా, జెమిని పాత వెర్షన్ ఆండ్రాయిడ్ పరికరాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. గూగుల్ ఏఐ సాంకేతికతను అనుభవించడానికి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ అవసరం లేదు.

నంబర్ వన్ దిశగా..

యాపిల్ కేవలం ఇంగ్లిష్ లోనే ఏఐని అందుబాటులో ఉంచుతుండగా.. గ్లోబల్ లీడర్ పొజిషన్ కోసం గూగుల్ విభిన్న భాషలకు మద్దతిచ్చే తన జెమినీ అసిస్టెంట్ తో మరింత సమగ్ర విధానాన్ని తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ పర్యావరణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేంద్ర భాగం చేసే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది.

మరిన్ని ఆవిష్కరణలు..

మేడ్ బై గూగుల్ 2024 ఈవెంట్లో గూగుల్ జెమినీతో పాటు గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ను ప్రారంభించింది. ఇది నాలుగు వేరియంట్లను లాంచ్ చేసింది. పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. అలాగే టెక్ దిగ్గజం పిక్సెల్ బడ్స్ ప్రో 2, పిక్సెల్ వాచ్ 3 లాంచ్‌ను ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..