Lenovo Legion Tab: మరో నయా గేమింగ్ ట్యాబ్ రిలీజ్ చేసిన లెనోవో.. నేటి నుంచే విక్రయాలు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు కొత్త తరహా వస్తువులు చేతుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా ఈ దశాబ్దంలో స్మార్ట్‌ఫోన్లు అత్యంత ఆదరణ పొందాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్‌లా ఉండే ట్యాబ్‌లను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గేమ్స్ ఆడే వారికి ట్యాబ్ అనువుగా ఉండడంతో విద్యార్థులు, గృహిణులు వీటిని అధికంగా వాడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టాప్ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ట్యాబ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ లెనోవో గేమింగ్ ట్యాబ్లెట్ లెనోవో లెజియన్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Lenovo Legion Tab: మరో నయా గేమింగ్ ట్యాబ్ రిలీజ్ చేసిన లెనోవో.. నేటి నుంచే విక్రయాలు ప్రారంభం
Lenovo Legion Tab
Follow us
Srinu

|

Updated on: Aug 15, 2024 | 3:15 PM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు కొత్త తరహా వస్తువులు చేతుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా ఈ దశాబ్దంలో స్మార్ట్‌ఫోన్లు అత్యంత ఆదరణ పొందాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్‌లా ఉండే ట్యాబ్‌లను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గేమ్స్ ఆడే వారికి ట్యాబ్ అనువుగా ఉండడంతో విద్యార్థులు, గృహిణులు వీటిని అధికంగా వాడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టాప్ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ట్యాబ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ లెనోవో గేమింగ్ ట్యాబ్లెట్ లెనోవో లెజియన్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గేమింగ్ టాబ్లెట్ మూడు వర్కింగ్ మోడ్‌లతో ఆవిరి థర్మల్ సొల్యూషన్‌తో వస్తుంది. ఈ నేపథ్యంలో లెనోవో లెజియన్ ట్యాబ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లెనోవో లిజియన్ ట్యాబ్‌లో విభిన్న వినియోగాలకు అనుగుణంగా బీస్ట్ మోడ్, బ్యాలెన్స్‌డ్ మోడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఆకట్టుకుంటాయి. కొత్త గేమింగ్ టాబ్లెట్ స్టార్మ్ గ్రే కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ గేమింగ్ టాబ్లెట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. లెనోవో లెజియన్ ట్యాబ్‌ను వినియోగదారులు లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆగస్ట్ 15 నుంచి కొనుగోలు చేయవచ్చని లెనోవో ప్రతినిధులు చెబుతున్నారు. 

లెనోవో లెజియన్ ట్యాబ్ స్పెసిఫికేషన్‌లు

ఈ గేమింగ్ టాబ్లెట్ 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 8.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ లెనోవా ప్యూర్‌సైట్ గేమింగ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. ఈ ట్యాబ్ బరువు 350 గ్రాములు. అలాగే 7.6 మిమీ థిక్ నెస్‌తో వస్తుంది. అలాగే ఈ ట్యాబ్  స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 4ఎన్ఎం ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఈ ట్యాబ్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాబ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6550 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. డిస్‌ప్లే పోర్ట్ 1.4 సపోర్ట్‌తో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను ఆధారంగా ఈ ట్యాబ్ పని చేస్తుంది. ఈ టాబ్లెట్ అధిక పనితీరుతో గేమింగ్ ప్రియులను మనస్సును దోచుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..