- Telugu News Photo Gallery Technology photos Bumper offer on those TVs on Amazon, What are the best TVs, Amazon Sale 2024 details in telugu
Amazon Sale 2024: అమెజాన్‌లో ఆ టీవీలపై బంపర్ ఆఫర్.. ది బెస్ట్ టీవీలు ఏంటంటే..?
ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ మొత్తం ఫ్రీడమ్ సేల్ సందడి నడుస్తుంది. అయితే ఈ సేల్స్‌లో చాలా కంపెనీ ఉత్పత్తులు తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా గృహోపకరణాల విషయానికి వస్తే టీవీలు అత్యంత చౌకగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్న 4 కే క్యూఎల్ఈడీ టీవీలపై అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి పిక్చర్ క్వాలిటీతో టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతం అమెజాన్‌లో టీవీలపై ఉన్న ఆఫర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Aug 15, 2024 | 3:45 PM

హైసెన్స్ ఈ68ఎన్ 4 కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ క్యూఎల్ఈడీ టీవీపై ప్రస్తుత సేల్‌లో 40 శాతం ఆఫర్ అందుబాుటలో ఉంది. ఈ టీవీ కేవలం రూ.26999కే సొంతం చేసుకోవచ్చు. క్వాంటం డాట్ కలర్ టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్, హెచ్‌డీఆర్ 10+ డీకోడింగ్, ఏఐ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్స్‌తో ఈ టీవీ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. డైరెక్ట్ ఫుల్ అర్రే, పిక్సెల్ ట్యూనింగ్ టెక్నాలజీ కారణంగా వైబ్రెంట్ కలర్స్ మంచి వీక్షణ అనుభవాన్ని వినియోగదారులు పొందుతారు.

టీసీఎల్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఈసేల్‌లో రూ.40,990కు అందుబాటులో ఉంది. వైఫై, యూఎస్‌బీ, ఈథర్నెట్, హెచ్‌డీఎంఐ వంటి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఎంపికలతో వచ్చే ఈ టీవీ 35 వాట్స్ అవుట్‌పుట్, డీటీఎస్ వర్చువల్, ఎక్స్ &డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ ప్రీమియం సౌండ్ అనుభవాన్ని ఇస్తుంది. వాయిస్ అసిస్టెంట్‌తో రిమోట్, ఏఐపీక్యూ ప్రో ప్రాసెసర్, గూగుల్ టీవీ ఇంటిగ్రేషన్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఐఫాల్కన్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ టీవీపై 65 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ టీవీలో స్మూత్ ప్లేబ్యాక్ కోసం 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో క్రిస్టల్-క్లియర్ ఇమేజ్‌ల కోసం అద్భుతమైన 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లతో పాటు ఎక్స్ టెక్నాలజీతో కూడిన 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ వినియోగదారులకు మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. 2 జీబీ 16 జీబీ వేరియంట్ టీవీ ధర ప్రస్తుతం రూ. 20,990గా ఉంది.

కొడాక్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ టీవీ అమెజాన్‌లో సేల్‌లో 31 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్, గూగుల్ టీవీ, హెచ్‌డీఆర్ 10 ప్ల, వంటి ఫీచర్లు ఆకట్టకుంటన్నాయి. అలాగే సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,750 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీ ధర రూ. 21,999గా నిర్ణయించారు.

వీఐ మాస్టర్‌పీస్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ టీవీ అమెజాన్‌లో సేల్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చే టీవీ ఏెండీ ఫ్రీసింక్ ప్రీమియం, హెచ్‌డీఆర్ గేమింగ్ మోడ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ ప్రస్తుతం రూ. 50,999కే అందుబాటులో ఉంది.




