- Telugu News Photo Gallery Technology photos Soon Infixin launching new tablet Infinix Xpad, Check here for features and price
Infinix Xpad: భారత మార్కెట్లోకి మరో కొత్త ట్యాబ్.. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర్స్..
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ట్యాబ్లెట్స్‌ను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అన్ని దిగ్గజ సంస్థలు మార్కెట్లోకి ట్యాబ్లెట్స్‌ను తీసుకురాగా.. తాజాగా మరో ఎలక్ట్రానిక్ సంస్థ ఇన్‌నిఫిక్స్ కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమమవుతోంది. ఇన్‌ఫినిన్స్ ఎక్స్‌ప్యాడ్ పేరుతో ఈ కొత్త ట్యాబ్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 14, 2024 | 10:50 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇన్‌ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ పేరుతో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ ట్యాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్ చేయనున్నారు.

ఇక ప్రాసెసర్ విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ సీపీయూతో కూడిన హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇన్‌ఫినిక్స్ కొత్త ప్యాడ్‌ను మూడు విభిన్న పవర్ మోడ్స్‌లో తీసుకొస్తున్నారని సమాచారం.

ఈ ట్యాబ్‌ను 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందులో చాట్‌జీపీటీ ఆధారిత ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను ఇవ్వనున్నారని టాక్.

కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 9 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.




