AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ 'సి', గ్రూప్ 'డి' ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు..

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
RRC Sports Quota Railway Jobs
Srilakshmi C
|

Updated on: Aug 16, 2024 | 7:29 AM

Share

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్‌-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్‌-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • లెవెల్‌-4/5 పోస్టులు: 5
  • లెవెల్‌-2/3 పోస్టులు: 16
  • లెవెల్‌-1 పోస్టులు: 43

ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగ
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగ
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా?
ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా?
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలుసా?
ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలుసా?