Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో కొంతమేర పనులు జరగ్గా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు చొరవ తీసుకుని మరికొన్ని పనులు పూర్తి చేశారు.

CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..
CM Revanth Reddy starts Sitarama project pump house
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2024 | 7:48 PM

సీతారామ ప్రాజెక్ట్‌ పంప్‌ హౌస్‌లను సీఎం రేవంత్ ప్రారంభించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములకపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.

ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరిస్తామని.. ఇది తమ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమని సీఎం రేవంత్ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేలకోట్లు దండుకుందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని ఆరోపించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు.

సీతారామ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఏర్పడనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో కొంతమేర పనులు జరగ్గా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు చొరవ తీసుకుని మరికొన్ని పనులు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..