రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ..

రైతులకు ఏకమొత్తంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ..
Cm Revanth Reddy
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 15, 2024 | 7:30 PM

రైతులకు ఏకమొత్తంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జులై 18న తెలగాణలో ప్రారంభమైన రైతు రుణమాఫీ ప్రక్రియ నేటితో ముగిసింది. 27 రోజుల్లో రైతులకు సంబంధించి 31వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన సభలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. మే ఆరు 2022న వరంగల్‌లో రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పైపా, పైసా లెక్కబెట్టి రుణమాఫీ చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత తనకు లభించడం తనకు దక్కిన అదృష్టమని తెలిపారు. BRS ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని భట్టి అన్నారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న మొత్తం మాఫీ అయిందని ప్రభుత్వం తెలిపింది. మూడో విడతలో రుణమాఫీ కింద 18 వేల కోట్ల రూపాయల విడుదల చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..