Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం

కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, అమీన్‌పూర్, అమీర్‌పేట్, మాదాపూర్ లో వాన దంచికొట్టింది. దీంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం
Heavy Rain In Hyderabad
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2024 | 8:51 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. గురువారం ఉదయం నుంచి విపరీతంగా కొట్టిన ఎండ, ఉక్కపోత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రానికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కుమ్మరించింది. నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, కూకట్ పల్లి, నిజాంపేట్, మాదాపూర్, హిమాయత్ నగర్, లఖ్డీకాపూల్, శేరిలింగంపల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, అమీన్‌పూర్, అమీర్‌పేట్, మాదాపూర్ లో వాన దంచికొట్టింది. దీంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..