3000 ఏళ్లనాటి మొసలికి సిటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఏం తిన్నదో తెలిసిపోయింది..!
ఆ సమయంలో ఈజిప్టు ప్రజలు మొసలి చర్మాన్ని కూడా ధరించేవారని, తద్వారా దుష్టశక్తులు దూరంగా ఉంటాయని నమ్మేవారని చెప్పారు. చనిపోయిన మొసళ్లను ఫెంగ్ షుయ్ భావించి ఇంటి గోడలపై లేదా తలుపులపై వేలాడదీసేవారని వివరించారు. ఇలా చేస్తే ప్రతికూల శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని వారు నమ్మేవారట.
ఈజిప్ట్ అంటేనే పిరమిడ్లు, మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక ఉన్న కథలు వేరే విషయం. ఈజిప్టులోని పురాతన ప్రజలు తమ బంధువులను మాత్రమే మమ్మీలుగా మార్చేవారు కాదు. వారు వేలాది జంతువులను కూడా మమ్మీలుగా మార్చి రక్షించారని చెప్పాలి. అలా జంతువులను మమ్మీలుగా చేయటం ద్వారా ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఈజిప్టులో 3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ లభ్యమైంది. ఈ మొసలిని సోబెక్ దేవుడికి నైవేద్యంగా చంపారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఈ మొసలి ఎలా చనిపోయింది..? చనిపోయే ముందు అది ఏం తిన్నది..? అనే విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ మమ్మీకి CT స్కాన్ చేశారు. స్కానింగ్‌లో ఏం వచ్చిందో చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. మొసలిని ఎలా చంపేశారు.? మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏం తినిపించారు.. అంటే దాని కడుపులో ఇంకా అప్పటి ఆహారం మిగిలి ఉందా..? అనే సందేహం కలుగకమానదు..
ఈజిప్ట్ పూర్వీకులు పక్షులు, మొసళ్ల మమ్మీలను కూడా మ్యాజిక్ ట్రిక్స్‌గా ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని దేవుడికి సమర్పించారట. ఇది క్రీస్తుపూర్వం 750 నుండి 250 AD మధ్య ఈజిప్టు కాలం. ప్రస్తుతం, ఈజిప్టులో కనిపించని కొన్ని జంతువుల మమ్మీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక పొడవైన మొసలి మమ్మీ శాస్త్రవేత్తలకు కనిపించింది. దీని పొడవు 2.23 మీటర్లు. ఇది బర్మింగ్‌హామ్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు.. దానిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించి రేడియోగ్రాఫిక్ అధ్యయనం చేయగా, ఈ మొసలి కడుపులో గ్యాస్ట్రోలిత్‌లు కనిపించాయట.
గ్యాస్ట్రోలిత్‌లు అనేవి అలిమెంటరీ కెనాల్‌లో కనిపించే చిన్న రాళ్లు. చాలా సార్లు మొసళ్ళు చిన్న రాళ్లను మింగేస్తాయి. తద్వారా అవి ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతాయట.. గ్యాస్ట్రోలిత్‌ల కనిపించటంతో మొసలిని మమ్మీ చేసిన వ్యక్తులు దాని అంతర్గత అవయవాలను బయటకు తీయలేదని నిర్ధారించారు. ఇంకా దాని పొట్ట లోపల మెటల్ ఫిషింగ్ హుక్, చేపలు కనిపించాయి. అప్పట్లో ఒక చేపను హుక్ చేసి నదిలో పడేసి మొసలిని పట్టుకునేవారట. మొసలి ఈ చేపను తినేందుకు వచ్చినప్పుడు వలలో చిక్కుకుపోయేది. ఈ కథ గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ పత్రాలలో లిఖించినట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..