Watch: రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోయారో మీకు తప్పదు మరి..! చిర్రెత్తిపోయిన జనం ఏం చేశారో చూస్తే వణుకే..!!

ఇరువైపులా కింద నిల్చున్న జనం ఈ సంఘటన మొత్తాన్ని మౌనంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి స్టంట్స్, రీల్స్‌ అంటూ పిచ్చి ప్రవర్తనతో రెచ్చిపోయే వారికి ఇలాగే గుణపాఠం చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Watch: రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోయారో మీకు తప్పదు మరి..! చిర్రెత్తిపోయిన జనం ఏం చేశారో చూస్తే వణుకే..!!
Reels Gone Wrong
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 18, 2024 | 8:10 PM

సోషల్ మీడియాలో వ్యూస్‌ కోసం చాలా మంది ప్రజలు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తమ రీల్స్ పిచ్చితో ఇతరులకు సమస్యలు ఎదురవుతున్నాయనే వాస్తవాన్ని కూడా వారు పట్టించుకోవటం మానేస్తున్నారు. అలాంటిదే ఈ వీడియో కూడా. సోషల్ మీడియాలో చాలా రకాల స్టంట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొందరు కదులుతున్న బైక్‌పై డ్యాన్స్ చేస్తుంటే, మరికొందరు విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి అనేక వీడియోలను గుర్తించిన పోలీసులు వారికి చలాన్లు కూడా జారీ చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, దాని కోసం పబ్లిక్‌గా వెళ్లి స్టంట్స్‌ను ప్రదర్శించాలని జనాలు తహతహలాడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి కర్ణాటక నుండి వెలుగులోకి వచ్చింది.

వైరల్‌ వీడియోలో కొందరు ఎత్తైన వంతెనపై నుండి విన్యాసాలు చేస్తూ.. వారి స్కూటీతో అమాంతంగా రోడ్డుపై పడ్డారు. కర్ణాటకలోని తుమకూరు జాతీయ రహదారిపై ఓ యువకుడు స్కూటర్‌తో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా రీల్‌ చేస్తున్నాడు. అతడి రీల్స్‌ కారణంగా ప్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్అయింది. జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు..రద్దీగా ఉండే రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ ఏంటంటూ కోపోద్రిక్తులైన జనాలు అతడి స్కూటర్‌ను ఫ్లైఓవర్‌పై నుంచి అమాంతంగా కిందకు విసిరేసారు.

ఇవి కూడా చదవండి

బ్రిడ్జి పై పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉండటం, స్కూటర్‌ని గాల్లోకి లేపి.. ఫ్లైఓవర్ కింద పడేయడం వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. ఇరువైపులా కింద నిల్చున్న జనం ఈ సంఘటన మొత్తాన్ని మౌనంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి స్టంట్స్, రీల్స్‌ అంటూ పిచ్చి ప్రవర్తనతో రెచ్చిపోయే వారికి ఇలాగే గుణపాఠం చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..