AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుతం..! ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..

పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్స్‌ ఆవిష్కృతమవుతాయి. ఈ రెండింటి కలయిలో వచ్చే సూపర్ మూన్ అరుదుగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుతం..! ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..
Supermoon Blue Moon
Jyothi Gadda
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 19, 2024 | 3:05 PM

Share

ఆగస్టు 19 ఓ ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ఆగస్టు 19 సోమవారం రాఖీపౌర్ణమి మాత్రమే కాదు.. మరో ప్రత్యేకత కూడా ఉంది. రక్షాబంధన్ రోజున ఒక ఖగోళ సంఘటన జరగబోతోంది. పౌర్ణమి వేళ వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆగస్ట్ 19న పౌర్ణమి రాత్రి సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. ఈ సూపర్‌మూన్ 2024లో అతిపెద్ద, ప్రకాశవంతమైన చంద్రుడు ప్రజల్ని కనువిందు చేయనున్నాడు. 2024లో వరుసగా మూడు సూపర్ మూన్‌లు కనువిందు చేయనున్నాయి.. ఇందులో రాఖీపౌర్ణమి పండుగ రోజున ఒకటి దర్శనం ఇవ్వనుండగా.. మరో సూపర్ మూన్ సెప్టెంబర్ 17న కనిపించనుంది.. దీనిని హార్వెస్ట్ మూన్ అంటారు. ఇక మూడోది.. అక్టోబర్ 17న కనిపించనుంది.. దీనిని  హంటర్ మూన్ గా పిలుస్తారు.. నవంబర్ 15న చివరి సూపర్ మూన్ కనువిందు చేయనుంది.. దీనిని బీవర్ మూన్ అంటారని పరిశోధకులు చెబుతున్నారు..

పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్స్‌ ఆవిష్కృతమవుతాయి. ఈ రెండింటి కలయిలో వచ్చే సూపర్ మూన్ అరుదుగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

వాస్తవానికి రాఖీ పూర్ణిమను పౌర్ణమి రోజునే జరుపుకుంటారు. సూపర్ బ్లూ మూన్‌తో ఈసారి రాఖీ పండగ వస్తోంది. ఈ కారణంగా ప్రతి భారతీయుడికి ఇది చాలా ప్రత్యేకంగా మారనుందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

1979లో రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పేరును పరిచయం చేశారు. దాని పేరుకు తగ్గట్టుగానే సూపర్ బ్లూ మూన్ రోజున చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమితో పోలిస్తే సూపర్‌మూన్ 30 శాతం వరకు ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ సూపర్ బ్లూ మూన్ సమయంలో చంద్రునిపై 98 శాతం నుంచి 100 వరకు సూర్యకాంతి ఉంటుంది. ఇది భూమికి దాదాపు 225,288 మైళ్ల దూరంలో ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..