Rakhi 2024: దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి.. భద్రకాల సమయంలో రాఖీ కట్టవద్దంటున్న జ్యోతిష్కులు.. శుభ సమయం ఎప్పుడంటే

ఈసారి రాఖీ పౌర్ణమి చాలా స్పెషలంటున్నారు జ్యోతిష్యులు. ఇవాళ రాఖీ పౌర్ణమి జరుపుకున్న వారికి 7శుభయోగాలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. రవియోగం, శశ్ రాజయోగం, శోభన్ యోగం, బుద్ధాదిత్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్యులు. శ్రావణమాసం సోమవారం, శ్రావణ పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో బ్లూమూన్ కనిపించబోతోంది.

Rakhi 2024: దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి.. భద్రకాల సమయంలో రాఖీ కట్టవద్దంటున్న జ్యోతిష్కులు.. శుభ సమయం ఎప్పుడంటే
Rakhi Festival
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2024 | 6:49 AM

అన్నాచెళ్లలు, అక్కాతమ్ముళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్‌ను యావత్ దేశం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. కులాలకు, మతాలకు అతీతంగా తోబుట్టువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లు సందడిగా మారాయి. అయితే రాఖీ కట్టే సమయంపై సస్పెన్స్‌ నెలకొంది.భద్రకాలం ముగిసిన తర్వాత కడితేనే శుభం జరుగుతోందంటున్నారు జ్యోతిష్యులు. ఇంతకీ ఏటైంలో రాఖీ కడితే శుభం జరుగుదంటే

ఏడాదికి ఒక్కసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకకగా దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈసారి రక్షా బంధన్‌కి మార్కెట్లో వివిధ డిజైన్లతో రంగురంగుల రాఖీలు సందడి చేస్తున్నారు. రంగు, రంగుల దారాలు, వివిధ రకాల పూసలు, వెండి రాఖీలు, బంగారు పూతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలకు మంచి డిమాండ్‌ ఉంది. రూపాయి నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఇటు స్వీట్‌ షాపులు కూడా కిటకిటలాడుతున్నాయి. రాఖీ పండుగ నాడు సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపిస్తారు సోదరీమణులు. దీంతో అటు రాఖీ, స్వీట్స్ అమ్మకాలు ఊపందుతున్నాయి.

అయితే ఈసారి రాఖీ పౌర్ణమి చాలా స్పెషలంటున్నారు జ్యోతిష్యులు. ఇవాళ రాఖీ పౌర్ణమి జరుపుకున్న వారికి 7శుభయోగాలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. రవియోగం, శశ్ రాజయోగం, శోభన్ యోగం, బుద్ధాదిత్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్యులు. శ్రావణమాసం సోమవారం, శ్రావణ పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో బ్లూమూన్ కనిపించబోతోంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌ మూన్ లేదా బ్లూమూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు చాలా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కొంతమంది దీనిని సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు రోజుల పాటు ప్రకాశవంతంగా కనిపించనుంది. మూడవ రోజు నుంచి చంద్రుడి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. రోజూ ఉండే చంద్రుని కాంతి కంటే సుమారు 30 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది. అరుదైన ఖగోళ ఘటనను చూడటానికి ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

150ఏళ్ల తర్వాత వచ్చే ఈబ్లూమూన్ ప్రభావం ఈసారి రాఖీ పౌర్ణమిపై ప్రభావం చూపుతుందంటున్నారు జ్యోతిష్యులు. శ్రావణమాసం పౌర్ణమి రోజున బ్లూమూన్ రావడం చాలా విశేషమంటున్నారు. భద్రకాలం సమయంలో రాఖీ కట్టకూడదని చెప్తున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు ఉండవంటున్నారు.

భద్ర కాలం ముగిసిన తర్వాతే మంచిగడియలు ఉన్నాయని చెప్తున్నారు. సంపూర్ణ శ్రేయస్సు కాంక్షతో సోదరీమణులు తమ సోదరుడికి రక్షణ కల్పిస్తూ .. క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ రాఖీ కట్టాలంటున్నారు జ్యోతిష్యులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు