AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi 2024: 500 ఏళ్ల వయసున్న కాశీలోని మీనాకారి రాఖీకి మళ్ళీ వైభవం.. విదేశాల్లో కూడా డిమాండ్.. ప్రత్యేకత ఏమిటంటే

ఈఏడాది రాఖీ పండగ సందర్భంగా మార్కెట్ లో ఎక్కడ చూసినా వెండి రాఖీలు సందడి చేశాయి. 500 సంవత్సరాల వయస్సున్న గులాబీ రంగు మీనకారితో తయారు చేసిన రాఖీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఇరవై ఐదు వేలకు పైగా రాఖీలు బనారస్ నుండి దేశానికి, ప్రపంచానికి పంపబడ్డాయి. పింక్ మీనాకరీ జాతీయ అవార్డు అందుకున్న కుంజ్ బిహారీ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా నిరంతరాయంగా పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పదివేలకు పైగా రాఖీలను పంపగలిగామని చెప్పారు.

Rakhi 2024: 500 ఏళ్ల వయసున్న కాశీలోని మీనాకారి రాఖీకి మళ్ళీ వైభవం.. విదేశాల్లో కూడా డిమాండ్.. ప్రత్యేకత ఏమిటంటే
Meenakari Special Rakhis
Surya Kala
|

Updated on: Aug 19, 2024 | 7:23 AM

Share

దేశ వ్యాప్తంగా మార్కెట్ లో రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. అయితే ప్లాస్టిక్, సింథటిక్ వస్తువులు లేని సమయంలో రాఖీలు ఎలా తయారు చేసేవారో ఊహించారా? ఆ సమయంలో పురాతన చేతిపనుల కళాకారులు వీటిని సిద్ధం చేసేవారు. ఈ రాఖీలను బంగారం, వెండి, ఖరీదైన రాళ్లతో తయారు చేస్తారు. పింక్ ఎనామిల్ పనిలో పనిచేసే కళాకారులు గత ఐదు వందల సంవత్సరాలుగా బనారస్‌లోని గైఘాట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. చాలా ఖరీదైనది కావడంతో ఈ చేతి వృత్తి అంతరించే దశకు చేరుకున్నా.. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషి వల్ల మళ్లీ జీవం పోసుకుంది.

ఈసారి రాఖీ పండగ సందర్భంగా గులాబీ రంగు మీనాకరీతో తయారు చేసిన రాఖీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఇరవై ఐదు వేలకు పైగా రాఖీలు బనారస్ నుండి దేశ, విదేశాలకు ఎగుమతి చేశారు. పింక్ మీనాకరీ జాతీయ అవార్డు అందుకున్న కుంజ్ బిహారీ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా నిరంతరాయంగా పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పదివేలకు పైగా రాఖీలను పంపగలిగానని అన్నారు. దేశంలో అత్యధిక డిమాండ్ పెద్ద నగరాల నుండి వచ్చింది, ఐరోపా, అమెరికా నుండి కూడా భారీ డిమాండ్ వచ్చింది.

వెండి రేకుపై ఖరీదైన రాళ్లతో రాఖీలను తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి
Meenakari Special Rakhis 1

Meenakari Special Rakhis 1

మీనాకరీ రాఖీలు డిమాండ్‌పై తయారు చేయబడతాయని కుంజ్ బిహారీ చెప్పారు. పేర్లు, ఖరీదైన రాళ్లతో కూడిన రాఖీలను చాలా మంది ఇష్టపడతారు. ఈ రాఖీలను వెండి రేకుపై బంగారం, ఖరీదైన రాళ్లను అలంకరించి తయారు చేస్తారు. ఈ రాళ్లలో, రూబీ, పుష్యరాగం, నీలమణిలతో అలంకరించమని ఆర్డర్స్ అందుకున్తున్నట్లు వెల్లడించారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారి దాదాపు రూ.2.5 లక్షల విలువైన డైమండ్ రాఖీని తయారు చేశాడు.

రాఖీలు కంకణాలు మరియు చెవి రింగులుగా మారుతాయి

ఈ రాఖీలన్నీ రాఖీ పండగ ముగిసిన తర్వాత వీటిని చెవి రింగులు, బ్రాస్‌లెట్‌లుగా కూడా ధరించే విధంగా తయారుచేశామని కుంజ్ బిహారీ వివరించారు. “ఒక పండగ.. రెండు ఉపయోగాలు అనే నే సాంకేతికత రాఖీలకు డిమాండ్‌ని పెంచింది. సోదరి మొదట మీనాకరీ రాఖీని తన సోదరుని మణికట్టుకు కట్టి, పండుగ తర్వాత దానిని చెవి ఉంగరం, బ్రాస్‌లెట్‌గా ఉపయోగించ వచ్చు ఈ మీనాకారీ రాఖీలను.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్