Skin Care Tips: మచ్చలేని, మెరిసే చర్మం కోసం ఈ 3 సూపర్ ఫుడ్స్ రోజూ తినండి.. మ్యాజిక్‌ చూస్తారు..

అయితే ఈ రసాయన చికిత్సలు మీ చర్మాన్ని కొంత సమయం తర్వాత మరింత పాడు చేస్తాయంటున్నారు నిపుణులు. కానీ, ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లలో మార్పులు మీ చర్మాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటిలో మూడు ముఖ్యమైన ఆహారపదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీకు తక్షణ ఫలితాలను ఇస్తుంది.

Skin Care Tips: మచ్చలేని, మెరిసే చర్మం కోసం ఈ 3 సూపర్ ఫుడ్స్ రోజూ తినండి.. మ్యాజిక్‌ చూస్తారు..
Skin Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 18, 2024 | 8:58 PM

చర్మాన్ని అందంగా, మచ్చ లేకుండా ఉంచుకోవడం ప్రస్తుత రోజుల్లో చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పెరిగిపోయిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ప్రజల్ని కుంగదీస్తోంది. దీంతో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు చర్మంపై అనేక రకాల చికిత్సలు మొదలుపెడుతున్నారు. అయితే ఈ రసాయన చికిత్సలు మీ చర్మాన్ని కొంత సమయం తర్వాత మరింత పాడు చేస్తాయంటున్నారు నిపుణులు. కానీ, ఇంటి చిట్కాలు, ఆహారపు అలవాట్లలో మార్పులు మీ చర్మాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటిలో మూడు ముఖ్యమైన ఆహారపదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీకు తక్షణ ఫలితాలను ఇస్తుంది.

* అవిసె గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

అవిసె గింజలు శరీరం, చర్మం రెండింటికీ ప్రయోజనకరమైన అంశాలను కలిగి ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో తేమను కాపాడతాయి. అవిసె గింజలు ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్‌కు ఉత్తమ మూలం. ఈ అన్ని మూలకాలు చర్మంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి. దీని రోజువారీ వినియోగం ముఖంపై వాపు, చర్మం పొడిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు ముఖంలోని మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. మీరు దీంతో ఫేస్ ప్యాక్‌ను కూడా తయారు చేసి మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* చర్మ సంరక్షణ కోసం అలోవెరా

కలబంద చర్మానికి ఒక అద్భుత ఔషధం. ఇందులో హైడ్రేటింగ్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై తేమను కల్పించటంలో సహాయపడుతుంది. కలబంద ముఖంపై మొటిమలు, ఎర్రటి మచ్చలను తగ్గిస్తుంది. కలబందను జ్యూస్ లాగా కూడా తాగవచ్చు. దాని జెల్ ను రోజూ ముఖానికి అప్లై చేసుకోవచ్చు.అయితే, ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కలబంద ఎప్పుడూ నేరుగా ఉపయోగించబడదట.. దీన్ని ఎప్పుడూ

* చర్మానికి బొప్పాయి

బొప్పాయి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండు. దీని వల్ల చర్మంలో రాడికల్స్ సమస్య ఉండదు. బొప్పాయి మీ చర్మంలో కొల్లాజెన్ పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది స్వయంచాలకంగా చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. బొప్పాయిని రోజూ ఖాళీ కడుపుతో తింటే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ముఖం నుండి డెడ్ స్కిన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జు చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ట్యానింగ్ కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..