AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోద్ది..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిత్ర, విచిత్రమైనవి అన్నీ మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. ఇలా కూడా జరుగుతాయా? అని ఈ వీడియోలు చూస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే నవ్వు రాకా.. మరికొన్ని చూస్తే మాత్రం నిజంగానే భయం వేస్తుంది. ఇంతకు ముందు అడవులకు జనాలు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అడవులకు దగ్గర్లోనే జనావాసాలు..

Viral Video: ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోద్ది..
Viral Video
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 19, 2024 | 10:00 PM

Share

సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిత్ర, విచిత్రమైనవి అన్నీ మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. ఇలా కూడా జరుగుతాయా? అని ఈ వీడియోలు చూస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే నవ్వు రాకా.. మరికొన్ని చూస్తే మాత్రం నిజంగానే భయం వేస్తుంది. ఇంతకు ముందు అడవులకు జనాలు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అడవులకు దగ్గర్లోనే జనావాసాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే జంతువులు జనాలపై ఎటాక్ చేయడం వంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. తాజాగా ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే. రెండు సింహాలు ఇంటి ముందుకు వచ్చాయి. సింహాలకు ధీటుగా తమ ధైర్యాన్ని ప్రదర్శించాయి కుక్కలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.

అర్థ రాత్రి సమయంలో అటుగా రెండు సింహాలు వెళ్తున్నాయి. అలా ఒక ఇంటి ముందుకు వచ్చి నిలబడి చూస్తున్నాయి. అయితే అక్కడే ఉన్న రెండు కుక్కలు సింహాలను చూడగానే అరవడం మొదలు పెట్టాయి. మరి అడవికి రాజు అయిన సింహాలు ఊరుకుంటాయా. అస్సలు తగ్గేదెలా అంటూ సింహాలు కూడా అరవడం మొదలు పెట్టాయి. ముందుగా ఒక ఇంటి గేటు ముందుకు వచ్చిన సింహం వచ్చి అరుస్తుంది. దాన్ని చూసిన ఒక కుక్క గట్టి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. మీద మీదకు వెళ్తూ అరుస్తుంది.

ఆ తర్వాత సింహం అక్కడి నుంచి వెళ్లిపోగా.. రెండో సింహం వస్తుంది. కుక్కలు అరవడం ఆపక పోవడంతో.. ముందు వెళ్లిన సింహం వచ్చి గట్టిగా గేటును తోస్తుంది. ఆ బలానికి గేటు ఊగుతుంది. గేటు తలుపులు ఊడి వచ్చేస్తాయి. కుక్కలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాయి. అయినా కుక్కలు అరవడం ఆపవు. కాసేపటికి ఒక అతను టార్చ్ లైట్‌తో వస్తాడు. బయటకు వచ్చి చూస్తాడు. కానీ ఈ వీడియో నిజంగానే భయాన్ని పుట్టించే వీడియో. అక్కడ మనుషులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో చెప్పడం కష్టం. ఇదంతా అక్కడే ఉన్న ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సంఘటన గుజరాత్‌లో జరిగింది..

Follow Us
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు