AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో.. సిమెంట్‌తో వెల్లుల్లి తయారు చేసి అమ్ముతున్నారు..తస్మాత్‌ జాగ్రత్త..!

ఈ నకిలీ వెల్లుల్లి గురించి పోలీసు శాఖలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక అధికారి వెల్లడించారు. తను కూడా ఇలాంటి నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయినట్టుగా వివరించారు.. మార్కెట్‌లో కల్తీ, మోసం జరుగుతున్న ఈ కాలంలో ఈ విషయం చాలా సీరియస్‌గా ఉందన్నారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో ఉపయోగించే వస్తువులతో కల్తీ బాధితులుగా మారుతున్నారని వాపోయారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వాపోయారు.

Watch: ఓరీ దేవుడో.. సిమెంట్‌తో వెల్లుల్లి తయారు చేసి అమ్ముతున్నారు..తస్మాత్‌ జాగ్రత్త..!
Fake Garlic Scandal
Jyothi Gadda
|

Updated on: Aug 18, 2024 | 9:42 PM

Share

నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వెల్లుల్లి సిమెంట్‌తో తయారు చేస్తున్నారు. ఇది నిజమైన వెల్లుల్లికి ఏ మాత్రం తీసపోకుండా ఉంటుంది. ఈ నకిలీ వెల్లుల్లి గురించి పోలీసు శాఖలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన సుభాష్ పాటిల్ వెల్లడించారు. తను కూడా ఇలాంటి నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయినట్టుగా వివరించారు.. మార్కెట్‌లో కల్తీ, మోసం జరుగుతున్న ఈ కాలంలో ఈ విషయం చాలా సీరియస్‌గా ఉందన్నారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో ఉపయోగించే వస్తువులతో కల్తీ బాధితులుగా మారుతున్నారని వాపోయారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వాపోయారు.

మహారాష్ట్ర అకోలాలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. అకోలా నగరంలోని బజోరియా నగర్‌లో నివసిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి సుభాష్ పాటిల్ ఇంటిముందుకు వచ్చిన వ్యాపారి వద్ద ఆయన భార్య వెల్లుల్లిని కొనుగోలు చేశారు.. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత వెల్లుల్లి తొక్క తీయడం ప్రారంభించినప్పుడు.. అవి చాలా గట్టిగా అనిపించింది. కత్తితో కోసినా లాభం లేకుండా పోయింది. దీంతో దాన్ని పూర్తిగా పరీక్షిస్తే.. అది సిమెంటుతో తయారు చేయబడిందని తేలింది. సిమెంట్, రంగుతో తయారు చేసిన నకిలీ వెల్లుల్లినికి తెల్లటి పెయింట్ చేశారని తెలిసి వారు నివ్వెర పోయారు. చూసేందుకు అచ్చంగా వెల్లుల్లిని పోలి ఉండటంతో వారు మోసపోయామని గ్రహించారు. దీంతో సదరు రిటైర్డ్‌ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో ఇటీవల వెల్లుల్లి ధర బాగా పెరిగింది. దాంతో కొందరు అత్యాశతో సిమెంటుతో తయారు చేసిన నకిలీ వెల్లుల్లిని ప్రజలకు విక్రయిస్తున్నారు. చిరువ్యాపారులు నకిలీ వెల్లుల్లిని తక్కువ ధరకే ప్రజలకు విక్రయించి వెళ్లిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, నగరాల్లో ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలోకు రూ.300 నుంచి రూ. 350 వరకు పెరిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..