AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Former Army Chief: భారత ఆర్మీ మాజీ చీఫ్‌ పద్మనాభన్‌ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్‌ పద్మనాభన్ (83) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. పద్మనాభన్‌ 2000 సంవత్సరం నుంచి 2002 వరకు రెండేళ్లపాటు 20వ ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు..

Former Army Chief: భారత ఆర్మీ మాజీ చీఫ్‌ పద్మనాభన్‌ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Former Indian Army Chief General S Padmanabhan
Srilakshmi C
|

Updated on: Aug 19, 2024 | 12:19 PM

Share

చెన్నై, ఆగస్టు 19: ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్‌ పద్మనాభన్ (83) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. పద్మనాభన్‌ 2000 సంవత్సరం నుంచి 2002 వరకు రెండేళ్లపాటు 20వ ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2002 డిసెంబర్‌ 31న సుందర రాజన్ ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. పద్మనాభన్ మృతి చెందిన విషయాన్ని ఇండియన్‌ ఆర్మీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

ఆయన 1940 డిసెంబర్‌ 5న కేరళ రాజధాని తిరువనంతపురంలో జన్మించారు. డిసెంబర్ 13, 1959న ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) నుంచి డిగ్రీ పట్టాపొందారు. ఆతన తన కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక పదవుల్లో పనిచేశారు. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాకముందు పద్మనాభన్.. సదరన్‌ కమాండ్‌లో జనరల్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. 1960 నుంచి 2002 వరకు.. దాదాపు 43 ఏళ్లపాటు ఆర్మీకి సేవలు అందించారు.

పద్మనాభన్ కెరీర్‌లో 15వ కార్ప్స్ కమాండర్‌గా జమ్మూ కాశ్మీర్‌లో మిలిటెన్సీతో ఆయన చేసిన కృషి దశాబ్దాల కృషి ఎనలేనిది. జూలై 1993 నుంచి ఫిబ్రవరి 1995 వరకు కాశ్మీర్ లోయలో లెఫ్టినెంట్ జనరల్‌గా,15 కార్ప్స్ కమాండర్‌గా జనరల్ పద్మనాభన్ ఆధ్వర్యంలో కాశ్మీర్‌లో మిలిటెంట్లపై జరిపిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఆయన సార్థధ్యంలో కశ్మీర్‌లోని మిలిటెంట్ల కార్యకలాపాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి.15వ కార్ప్స్ కమాండర్‌గా ఆయన అందించిన సేవలకుగానూ అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) అందుకున్నారు. అనంతరం జనరల్ పద్మనాభన్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI)గా నియమితులయ్యారు. అతను ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడక ముందు నార్తర్న్ కమాండ్‌కి, సదరన్ కమాండ్‌కి GOCగా పనిచేశారు. 2002లో పద్మనాభన్ పదవీ విరమణ తర్వాత చెన్నైలో సెటిల్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..