Viral: ఈ ట్రక్ డ్రైవర్ నెల ఆదాయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఓ ట్రక్ డ్రైవర్ కూడా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యారు. తనకున్న టాలెంట్‌తో నెలకు లక్షలు సంపాదిస్తూ చాలామందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. దీంతో ఆయన సంపాదన విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాను వినియోగించడం కూడా ఒక ఆర్ట్. మీ దగ్గర క్రియేటివిటీ ఉంటే.. దండిగా డబ్బు సంపాదించవచ్చు. మీ ఫేట్‌ను మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు అలాంటి ఓ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఇతని పేరు రాజేష్ రావణి. కృషి, అభిరుచి.. ఒక మనిషి జీవన విధానాన్ని ఎలా మారుస్తుందో తెలియజేయడానికి ఇతని జీవితం ఉదాహారణ. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ అనే చిన్న పట్టణానికి చెందిన రాజేష్, తన తండ్రి అడుగుజాడలను అనుసరించి ట్రక్ డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్న రాజేష్ ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. మరో మాటలో చెప్పాలంటే, అతను యూట్యూబ్ స్టార్. కుకింగ్ వీడియోలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, తన సుదీర్ఘ ప్రయాణంలో తాను స్వయంగా ఆహారాన్ని వండుకునేవాడినని, ఈ అభిరుచి యూట్యూబ్‌లో వీడియోలు చేయడానికి తనను ప్రేరేపించిందని అతను చెబుతున్నాడు.
వృత్తిలో భాగంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే అతను.. మార్గమధ్యంలో ఎలా వంట చేసుకుంటారు.. ఏం ఏం కుక్ చేస్తారు. తన దినచర్య ఎలా ఉంటుంది లాంటి వీడియోలు చేస్తుంటారు. అనతికాలంలోనే అతని వీడియోలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రజంట్ అతనికి యూట్యూబ్ ఛానెల్‌లో 1.87 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి నెలా లక్షల రూపాయలు ఇన్‌కం వస్తుంది.
తొలుత తాను వంట చేస్తున్న వీడియోను.. తన కొడుకు యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడని, అది తనకు సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చిందని ట్రక్ డ్రైవర్ చెప్పాడు. దీని తరువాత, ‘ఆర్ రాజేష్ వ్లాగ్స్’ చానల్ పెట్టి వ్లాగింగ్ చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే అతనికి మంచి పాపులారిటీ దక్కింది. అభిరుచి, కృషి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనడానికి రాజేష్ ప్రయాణమే నిదర్శనం. ఆయన విజయంలో కుటుంబసభ్యుల సహకారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.
వీడియో దిగువన చూడండి…..
View this post on Instagram
రావణి… ట్రక్కు నడపడం ద్వారా నెలకు రూ 25,000 నుండి రూ 30,000 సంపాదిస్తున్నాడు. కానీ యూట్యూబ్ ద్వారా నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కొన్నిసార్లు తనకు నెలకు 10 లక్షల ఇన్‌కం వచ్చిన దాఖలాలు ఉన్నాయన్నాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో తన సొంత కలల ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఈ రాజేష్ కథ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికే కాదు, తమ కలలను నెరవేర్చుకోవాలనుకునే వారందరికీ స్ఫూర్తిదాయకం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..