Viral Video: బామ్మ ఐడియా అదుర్స్.. పాత చెప్పులకు కొత్త డిజైన్! ఎందుకో తెలిస్తే ఫిదా కావాల్సిందే
కొత్త చెప్పులేసుకున్నా.. ఒక్కోసారి పుటుక్కున తెగిపోతుంటాయి. దీంతో చాలా మంది కొత్త చెప్పులు తిగిపోయినందుకు ఓ అర నిమిషం బాధపడి.. వాటిని అక్కడే పడేసి షాప్‌కి వెళ్లి మరో జత కొనుకుంటారు. ఇలా చేయడం వల్ల జేబులు ఖాళీ అవ్వడమే కాకుండా రోడ్డుపై చెత్తను పోగేసిన వారవుతుంటారు. అయితే బాగా పాత బడిన చెప్పులు.. రోడ్డుపై నడుస్తుంటే జారీ పోతున్నాయని ఓ బామ్మ వెరైటీ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. రూపాయి ఖర్చులేకుండా..
కొత్త చెప్పులేసుకున్నా.. ఒక్కోసారి పుటుక్కున తెగిపోతుంటాయి. దీంతో చాలా మంది కొత్త చెప్పులు తిగిపోయినందుకు ఓ అర నిమిషం బాధపడి.. వాటిని అక్కడే పడేసి షాప్‌కి వెళ్లి మరో జత కొనుక్కుంటారు. ఇలా చేయడం వల్ల జేబులు ఖాళీ అవ్వడమే కాకుండా రోడ్డుపై చెత్తను పోగేసిన వారవుతుంటారు. అయితే బాగా పాత బడిన చెప్పులు.. రోడ్డుపై నడుస్తుంటే జారీ పోతున్నాయని వాటిని పడేయకుండా ఓ బామ్మ వెరైటీ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. రూపాయి ఖర్చులేకుండా సింపుల్‌గా సమస్యకు పరిష్కారం చూపింది. అందుకు కొత్త డిజైన్‌ను అద్దింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాత వస్తువులను పడేయకుండా మళ్లీ వాటిని ఎలా వాడుకోవాలో ఈ బామ్మను చూసి నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.
ఈ వీడియోలో ఓ బామ్మ చాలా సింపుల్ ట్రిక్‌తో అరిగిపోయిన చెప్పులు.. నడిచేటప్పుడు జారకుండా ఉండేందుకు చిటికెలో పరిష్కారం చేప్పేసింది. స్టవ్ దగ్గర ఓ ఇనుప చువ్వను కాల్చి, చెప్పుల వెనుక భాగంలో గీతలు పెట్టింది. ఇలా చేస్తే నడిచేటప్పుడు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పబ్టీ’ హ్యాండిల్ షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు బామ్మ తెలివితేటలకు తెగ ముచ్చటపడి పోతున్నారు. ‘బామ్మా.. నువ్వు అపర మేధావివి’, ‘వంటగదిలో వెల్డింగ్ పనులు చేయకూడదు’ అంటూ కొందరు జోకులు పేల్చుతుంటే.. మరికొందరేమో మెటల్ వేడిచేసి, చేతులతో పట్టుకుంటే కాలకుండా ఎలా ఉందబ్బ.. ఇది వృద్ధ తల్లులకు మాత్రమే సాధ్యం’ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
‘మీ నాన్నకు 10-డాలర్ల విలువ చేసే జత షూలను సేవ్ చేయడానికి చేసిన ప్రయత్నంలా ఉందే’, ఇకపై నా కారు టైర్లకు పంక్చర్ అయితే నేను కూడా ఈ ట్రిక్ ఫాలో అవుతాను’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో సరదాగా జోకులు పేలుస్తున్నారు. ఏది ఏమైనా పాత వాటిని తిరిగి వాడుకోవడం తప్పుకాదు. ఇలా చేస్తే డబ్బు ఆదా చేయడంతోపాటు మనసుకు కూడా కాస్త తృప్తిగా ఉంటుంది. మీరేం అంటారు… నిజమేకదా!