Viral News: ఇదో విచిత్ర ప్రేమ కథాచిత్రమ్..! ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువతులు.. థ్రపల్ రిలేషన్షిప్ అంటే ఏమిటో తెలుసా

దీని గురించి తెలుసుకుంటే మానవుల జీవన పయనం ఎటువైపు సాగుతుంది అంటూ తలని పట్టుకునేలా చేస్తుంది. ఈ వింత సంబంధంలో ముగ్గురు వ్యక్తులు శృంగార సంబంధంలో జీవిస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి 'థ్రపల్ రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక వార్త చర్చనీయాంశమైంది. కేటీ, నెస్ అనే ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరి 'భార్య'ల మధ్యలో మరొక మహిళ ప్రవేశించింది. ఇప్పుడు ఈ ముగ్గురూ యువతులు శృంగార సంబంధం కలిగి ఉన్నారు. ఒకే పైకప్పు క్రింద నివసిస్తున్నారు.

Viral News: ఇదో విచిత్ర ప్రేమ కథాచిత్రమ్..! ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువతులు.. థ్రపల్ రిలేషన్షిప్ అంటే ఏమిటో తెలుసా
Throuple Relationship
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2024 | 11:20 AM

లెస్బియన్, స్వలింగ సంపర్కుల జంటల గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే.. అయితే మీరు ఎప్పుడైనా ‘థ్రపల్ రిలేషన్షిప్’ గురించి విన్నారా? ఈ సంబంధం చాలా వింతగా ఉంటుది. దీని గురించి తెలుసుకుంటే మానవుల జీవన పయనం ఎటువైపు సాగుతుంది అంటూ తలని పట్టుకునేలా చేస్తుంది. ఈ వింత సంబంధంలో ముగ్గురు వ్యక్తులు శృంగార సంబంధంలో జీవిస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి ‘థ్రపల్ రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక వార్త చర్చనీయాంశమైంది. కేటీ, నెస్ అనే ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరి ‘భార్య’ల మధ్యలో మరొక మహిళ ప్రవేశించింది. ఇప్పుడు ఈ ముగ్గురూ యువతులు శృంగార సంబంధం కలిగి ఉన్నారు. ఒకే పైకప్పు క్రింద నివసిస్తున్నారు.

ఈ వింత రిలేషన్ షిప్ అమెరికాలోని మసాచుసెట్స్ లో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు అమ్మాయిలు ఒక ప్రత్యేకమైన సంబంధంలో కలిసి ఉన్నారు. కేటీ, నెస్‌లకు అప్పటికే వివాహం జరిగింది. దీని తర్వాత ఈ జంటలో ఒక యువతి తన స్నేహితుల్లో ఒకరైన కెల్లీతో ప్రేమలో పడింది. దీంతో ఈ ముగ్గురు యువతులు ఒకరికొకరుగా తోడునీడగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం కేటీ, నెస్ ప్రేమించుకుని 2021లో వివాహం చేసుకున్నారు. ఈ జంట చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నవంబర్ 2022లో కెల్లీ ఈ లెస్బియన్ జంట జీవితంలోకి ప్రవేశించింది. దీంతో వీరి జీవితం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ముగ్గురం కలిసి డిస్నీ వరల్డ్‌కు వెళ్లామని.. అక్కడ తమ సంబంధం మరింత బలపడిందని కేటీ చెప్పింది. ఆ తర్వాత తాము ముగ్గురం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కేటీ, నెస్ ,కెల్లీ

Throuple 1

TikTok/@traveling_throuple

థ్రపల్ రిలేషన్షిప్ కు సంబంధించిన వింత ప్రేమ కథను యూట్యూబ్ సిరీస్ ‘లవ్ డోంట్ జడ్జ్’లో పంచుకున్నాడు. కాటీ, నెస్ , కెల్లీ తరచుగా సోషల్ మీడియా @traveling_throupleలో తమ బలమైన సంబంధం గురించి పోస్ట్ చేస్తారు. అయితే ఈ ముగ్గురు యువతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లల సంబంధ విషయంలో సంతోషంగా లేరు. ఈ బంధాన్ని అంగీకరించడం అసౌకర్యంగా ఉంటుందని భావిస్తారు.

ఈ వింత సంబంధానికి సంబంధించి ముగ్గురికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు వ్యక్తులు వీరి సంబంధాన్ని అసాధారణమైనది.. ఆమోదయోగ్యం కానిదిగా భావిస్తున్నారు. మరికొందరు వీరి ధైర్యాన్ని అభినందిస్తారు. ఏదేమైనా ప్రస్తుతం వీరి సంబంధం సమాజంలో చర్చనీయాంశమైంది. అయితే కేటీ, నెస్ , కెల్లీలు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో సంతోషంగా జీవిస్తున్నారు. తమ ఈ సంబంధాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే