జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని ఏ రాశివారు ఏ రంగు దుస్తులతో అలంకరిస్తే శుభ ఫలితాలు ఇస్తాయంటే
ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగస్టు 26న జరుపుకోనున్నారు. ఇంట్లో బాల గోపలుడిని అలంకరించాలని నియమ నిష్టలతో పూజించాలని కోరుకుంటారు. అయితే రాశి ప్రకారం లడ్డూ గోపాల్‌ని అలంకరిస్తే విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. శ్రీకృష్ణుని వేషధారణకు రాశికి చెందిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక రంగులు ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. శ్రీకృష్ణుని అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలంటే
హిందూ మతంలో శ్రీకృష్ణుని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఉన్న కన్నయ్య భక్తులు అందరూ జన్మాష్టమిగా ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు హిందువులు తమ ఇంట్లో బాల గోపాలుడిని స్వాగతిస్తారు. ఇలా లడ్డూ గోపాల్‌ని ఇంటికి స్వాగతించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో బాల గోపాలుడిని పూజిస్తారు. కన్నయ్య అందంగా అలంకరిస్తారు. వివిధ రకరకాల పదార్ధాలను కన్నయ్యకు నైవేద్యంగా అందజేస్తారు. ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగస్టు 26న జరుపుకోనున్నారు. ఇంట్లో బాల గోపలుడిని అలంకరించాలని నియమ నిష్టలతో పూజించాలని కోరుకుంటారు. అయితే రాశి ప్రకారం లడ్డూ గోపాల్‌ని అలంకరిస్తే విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. శ్రీకృష్ణుని వేషధారణకు రాశికి చెందిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక రంగులు ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. శ్రీకృష్ణుని అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలంటే
రాశి ప్రకారం కన్నయ్య అలంకరణ కోసం ఏ రంగుల దుస్తులను ఉపయోగించాలంటే
- మేష రాశి – మేష రాశి వారు బాల గోపాలుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం ఈ రాశి వారికి ప్రయోజనం ఉంటుంది.
- వృషభ రాశి – వృషభ రాశి వారు లడ్డూ గోపాలాన్ని వెండి వస్తువులతో అలంకరించాలి. దీంతో లాభాలు పెరుగుతాయి.
- మిథునరాశి – మిథున రాశి భక్తులు చిన్నారి కన్నయ్యను లహరియ ముద్రిత దుస్తులతో అలంకరించవచ్చు.
- కర్కాటక రాశి – కర్కాటక రాశి వారు లడ్డూ గోపాల్‌ని తెల్లటి రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- సింహం – సింహ రాశి వారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున లడ్డూ గోపాల్‌ను గులాబీ రంగు దుస్తులతో అలంకరిస్తే అది ఈ రాశికి చెందిన వ్యక్తులకు మేలు చేస్తుంది.
- కన్యారాశి – ఆకుపచ్చ రంగు కన్యారాశి వారికి శుభప్రదం. లడ్డూ గోపాలాన్ని ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించవచ్చు.
- తులారాశి – జన్మాష్టమి శుభ సందర్భంగా తుల రాశి వారు శ్రీ కృష్ణుడిని కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి.
- వృశ్చిక రాశి – వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించవచ్చు. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- ధనుస్సు రాశి – కన్నయ్య జన్మ దినం రోజున శ్రీకృష్ణుని అలంకారంలో ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులను ఉపయోగించడం ప్రయోజనకరం.
- మకర రాశి – మకరరాశి వారికి పసుపు, ఎరుపు రంగులు రెండూ శుభప్రదమైనవి. కనుక ఈ రాశి వారు శ్రీకృష్ణుని అలంకారంలో ఈ రెండు రంగుల దుస్తులను ఉపయోగించవచ్చు.
- కుంభం – కృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు లడ్డూ గోపాలాన్ని అలంకరించేందుకు నీలం రంగు దుస్తులను ఉపయోగించవచ్చు.
- మీనం – మీనరాశి వారు లడ్డూ గోపాల్‌ని పసుపు రంగు దుస్తులతో అలంకరించవచ్చు. దీంతో లాభాలు పెరుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు