Budh Vakri: వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త.. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురుదెబ్బలకు అవకాశం
సింహ రాశిలో వక్రించి తిరోగమనం చెంది ఈ నెల 23 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్న బుధుడితో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కర్కాటకంలో బుధుడి వక్ర గమనం సెప్టెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుంది. కర్కాటకంలో బుధుడు వక్రించడం వల్ల మేషం, వృషభం, సింహం, వృశ్చికం, దనుస్సు, కుంభ రాశుల వారు ఏ విషయంలోనైనా ఆచి తూచి అడుగువేయాల్సి ఉంటుంది.
సింహ రాశిలో వక్రించి తిరోగమనం చెంది ఈ నెల 23 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్న బుధుడితో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కర్కాటకంలో బుధుడి వక్ర గమనం సెప్టెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుంది. కర్కాటకంలో బుధుడు వక్రించడం వల్ల మేషం, వృషభం, సింహం, వృశ్చికం, దనుస్సు, కుంభ రాశుల వారు ఏ విషయంలోనైనా ఆచి తూచి అడుగువేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎదురు దెబ్బలు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి ఒప్పందాలు, గృహ ఒప్పందాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రుల వల్ల నష్టపోవడం, నమ్మక ద్రోహాలు, దొంగతనాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. తరచూ గణపతి స్తోత్రం పఠించడం వల్ల చాలావరకు ఉపశమనం ఉంటుంది.
- మేషం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న బుధుడు వక్రిస్తున్నందువల్ల కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆస్తి, గృహ సంబంధాలపై సంతకాలను, నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోవడం, ఉద్యోగ, పెళ్లి అవకాశాలు చివరి క్షణంలో వెనక్కి వెళ్లి పోవడం వంటివి జరగవచ్చు. కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.
- వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో వక్ర బుధుడు ప్రవేశిస్తున్నందువల్ల ఆహార, విహారాల్లోనూ, ప్రయాణా ల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తొందరపాటు తనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులు అపనిందలు వేసే అవకాశం ఉంది. ఎవ రితోనూ ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆదాయం బాగా దుర్వ్య యం అవుతుంది. మిత్రులు మోసగించే అవకాశం ఉంది. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి.
- సింహం: ఈ రాశికి ధన, లాభ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి వ్యయ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ధన వ్యయం బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ధన నష్టం జరగడం కానీ, మోసపోవడం కానీ జరుగుతుంది. ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం మంచిది. కొద్ది రోజుల పాటు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సంబంధమైన ప్రలోభాలకు లొంగకపోవడం శ్రేయస్కరం. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొద్దిగా నిరాశ తప్పకపోవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో వక్ర బుధుడి ప్రవేశం వల్ల, ప్రయాణాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాల వల్ల, ప్రయత్నాల ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో ఆశాభంగం చెందే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు అందక ఇబ్బందులు పడడం జరుగుతుంది. శుభ కార్యాల్లో ఖర్చులు రెట్టింపవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి అష్టమ స్థానంలో వక్ర బుధుడి ప్రవేశం వల్ల ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలకు ఎక్కు వగా అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు తలెత్త వచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఆఫర్లు అందకపోవచ్చు. చిన్న ఉద్యోగాలకు ఆఫర్లు రావచ్చు.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో వక్ర బుధ సంచారం వల్ల సాధారణంగా అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఏ పనీ, ఏ ప్రయత్నమూ ఆశించిన విధంగా జరిగే అవకాశం ఉండదు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దా నాలూ చేయవద్దు. కొందరు బంధుమిత్రులు చెప్పే తీపి కబుర్లకు మోసపోవద్దు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టకపోవడం మంచిది. యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది.