Jupiter’s Transit 2024: రేపు రాశిని మార్చుకోనున్న బృహస్పతి.. ఈ 3 రాశుల వారికి టెన్షన్ టెన్షన్.. అధిక ఖర్చు.. జగ్రత్త సుమా
సంపదకు కారకుడైన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే సముయంలో ఆ రాశులకు మంచి చెడులకు కారణం అవుతాడని నమ్ముతారు. బృహస్పతి రాశిలో మార్పు కొన్ని రాశులపై శుభ ప్రభావం కలుగగా.. ఇతర రాశులపై అశుభ ప్రభావం చూపుతుంది. బృహస్పతి ఆగష్టు 20న మృగశిర నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ రాశికి అధిపతి కుజుడు.
శ్రావణ మాసంలోని పౌర్ణమి తిది అనంతరం గురువు తన రాశిని మార్చుకోనున్నాడు. దీంతో దేశంలోమాత్రమే కాదు ప్రపంచంలోని మానవ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాడు. బృహస్పతి రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అపారమైన లాభాలు కలుగగా, కొన్ని రాశుల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బృహస్పతి సంచారం వలన ఏ రాశులు అశుభంగా ప్రభావితమవుతాయో తెలుసుకుందాం..
ఆగస్ట్ 19న రాఖీ పండగను జరుపుకుంటున్నారు. దీని తరువాత రోజు అంటే మంగళవారం, 20 ఆగస్టున బృహస్పతి రాశిని మార్చుకోనున్నాడు. నవంబర్ 28 వరకు బృహస్పతి ఈ రాశిలో ఉంటాడు. బృహస్పతి రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశులకు సమస్యలు పెరుగుతాయి. ఈ రాశుల వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి: మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారికి సమస్యలు అధికం కావచ్చు. ఈ కాలంలో వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలోని సీనియర్లు ఈ రాశికి చెందిన వ్యక్తుల పట్ల అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరు మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. ఎంత కష్టపడి పని చేసినా విజయం సాధించడంలో వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తులారాశి: తుల రాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి రాశిలో మార్పు వల్ల ఒత్తిడి పెరుగుతుంది. బృహస్పతి రాశిలో మార్పు సమయంలో ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. అంతేకాదు వీరు ఆర్థికంగా బలహీనంగా మారవచ్చు. మితిమీరిన ఖర్చుల కారణంగా, ఖజానా ఖాళీ కావచ్చు. మనస్సు కలత చెందుతుంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుంభ రాశి: కుంభ రాశి వారు బృహస్పతి నక్షత్రం సంచారం వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈ కాలంలో ఎవరికీ రుణం ఇవ్వకండి లేదా పెట్టుబడి పెట్టకండి. ప్రస్తుతానికి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఉద్యోగాలలో పనిచేసే కుంభ రాశి వారికి ఈ సమయం మంచి సమయం కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మాటలను పట్టించుకోకుండా ఉండండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు