Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారి కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారి పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారి కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారి పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపపడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా ఏదైనా అదృష్టం పట్టవచ్చు. వృత్తి, ఉద్యోగా లలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. కొందరు బంధుమిత్రులతో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు వెడతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తప్పకుండా పూర్తవుతాయి. సొంత ఇంటి మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపో తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో సంపాదన అంచనాలను మించుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు కొద్ది శ్రమతో చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ముగుస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందు తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. తలపెట్టిన పనులన్నీనిదానంగా పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఆశిం చిన పదో న్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగు తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ధనపరంగా ఇతరులకు వాగ్దా నాలు చేయకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవు తాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవు తాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ అవకాశాలు బాగా పెరు గుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వాహన యోగానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సామరస్యం పెరుగుతుంది. కుటుంబప రంగా ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుం టారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ సమేతంగా కలిసి ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల శ్రద్ధ పెడ తారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు అధికారులకు సంతృప్తి కరంగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా బాగా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఎవరికీ ఏ విషయంలోనూ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు సకాలంలో సరైన విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాల్లో లాభాలకు లోటేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహా రాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అంది వచ్చే అవకాశముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందు తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మీ కారణంగా కొందరు బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చాలాకాలంగా ఆగిపోయి ఉన్న పదోన్నతి లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలున్నాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఒక మోస్తరుగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్త రిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.