Horoscope Today: వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఢోకా లేదు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 19, 2024): మేష రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. సాధారణంగా ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఢోకా లేదు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 19th August 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 19, 2024): మేష రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. సాధారణంగా ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. సాధారణంగా ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపో తాయి. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కొత్త ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరం. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అయితే, కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్య మైన వ్యవహారాలను కొద్ది శ్రమతో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కార్యకలా పాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాగా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

షేర్లు. స్పెక్యులేషన్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడ తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సర దాగా గడుపుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం కాస్తంత ఎక్కువ గానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు కూడా నెరవేరు తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారు లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ అధికారులను మీ పని తీరుతో మెప్పిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దగ్గర బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకోకుండా కొన్ని శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయగలుగు తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పెండింగ్ పనులన్నీ పూర్తయి, ఆర్థికంగా లాభం కలుగుతుంది. ముఖ్యమైన కార్యకలాపాల్ని కూడా ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యో గంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయ త్నంతో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సహా యంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులను, సహోద్యోగులను మీ వ్యవహార శైలితో ఆకట్టుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అన్ని విషయాల్లోనూ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో మీకు బాగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులకు ఆర్థి కంగా సహాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులు విజయాలు సాధి స్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఉన్న ప్పటికీ అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యక్తిగత సమ స్యలకు పరిష్కారం లభిస్తుంది. అదనపు ఖర్చులు తప్పక పోవచ్చు. విద్యార్థులకు శ్రమ తప్పదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. కొందరు బంధువుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిపాటి అనారోగ్య సూచన లున్నాయి. ఉద్యోగం మారడానికి సమయం బాగుంది. అనుకోకుండా నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో రాబడికి కొద్దిగా పెరుగుతుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.

డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..?
ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..?
నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..
నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..
బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ చేసుకున్న రష్మిక మందన్న..
బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ చేసుకున్న రష్మిక మందన్న..
మీ వాట్సాప్‌కు భద్రత ఉన్నా హ్యాక్‌ ఎలా అవుతుంది?ఈ తప్పులు చేయకండి
మీ వాట్సాప్‌కు భద్రత ఉన్నా హ్యాక్‌ ఎలా అవుతుంది?ఈ తప్పులు చేయకండి
తమిళ్ కంటే తెలుగే బెటర్.. ఇక్కడ గౌరవం ఉంటుంది..
తమిళ్ కంటే తెలుగే బెటర్.. ఇక్కడ గౌరవం ఉంటుంది..