AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే! ఈ టోపీ విలువ 5 కోట్లు.. దీనిలో వజ్రం, ముత్యం లేదు.. మరి టోపీ ప్రత్యేకత ఏమిటి?

ఈ క్యాప్ ధర నిజంగా కోట్లలో ఉంది మరి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. దీనిని కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖరీదు అంటే ఈ క్యాప్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఎందుకంటే ఈ టోపీలో ఏ అరుదైన వజ్రం లేదా ముత్యం పొదిగలేదు.. బంగారంతో తయారు చేయలేదు.. దీన్ని ధరించడం వల్ల ఏదైనా అద్భుతం జరుగుతుందా? అంటే అదీ లేదు.. అయినా సరే టోపీని కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం..

అరెరే! ఈ టోపీ విలువ 5 కోట్లు.. దీనిలో వజ్రం, ముత్యం లేదు.. మరి టోపీ ప్రత్యేకత ఏమిటి?
Hat Fetches Rs5 Crore At Auction
Surya Kala
|

Updated on: Aug 20, 2024 | 8:50 AM

Share

ఎండ, వానల నుంచి జుట్టుని రక్షించడానికి ధరించే టోపీని కొంతమంది ఫ్యాషన్ కోసం కూడా ధరిస్తారు. అయితే ఈ టోపీల ధరలు వంద నుంచి మన్నిక డిజైన్ బట్టి వెయ్యే రెండు వేలో ఉంటుందేమో.. అంతేకానీ క్యాప్ ఖరీదు కొట్లలో ఉంటుంది అని ఎప్పుడైనా విన్నారా.. అవును ఈ టోపీ ధర విన్న తర్వాత అమ్మో అంటూ షాక్ తింటారు. ఎందుకంటే ఈ క్యాప్ ధర నిజంగా కోట్లలో ఉంది మరి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. దీనిని కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖరీదు అంటే ఈ క్యాప్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఎందుకంటే ఈ టోపీలో ఏ అరుదైన వజ్రం లేదా ముత్యం పొదిగలేదు.. బంగారంతో తయారు చేయలేదు.. దీన్ని ధరించడం వల్ల ఏదైనా అద్భుతం జరుగుతుందా? అంటే అదీ లేదు.. అయినా సరే టోపీని కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం..

చలనచిత్ర ప్రేమికులకు అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా క్లాసిక్ ఫిల్మ్‌లు, వాటి దిగ్గజ పాత్రలకు సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఉన్న వారికి. ‘ఇండియానా జోన్స్’ సిరీస్‌లోని హాలీవుడ్ సినిమాలు వాటి ఉత్తేజకరమైన కథలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ సిరీస్ లో వాటి పాత్రలు, ఆ పాత్రలకు సంబంధించిన చిహ్నాలు కూడా చాలా ముఖ్యమైనవి.

‘ఇండియానా జోన్స్’ సిరీస్‌లోని 1984 చిత్రం ‘ది టెంపుల్ ఆఫ్ డూమ్’లో నటుడు హారిసన్ ఫోర్డ్ ధరించిన టోపీ ఇటీవల వేలం వేయబడింది. ఈ వేలంలో ఈ టోపీని $6,30,000 (అంటే మన దేశ కరెంసిలో రూ. 5.28 కోట్లకు పైగా) కు దక్కించుకున్నారు కూడా.. ఇండియానా జోన్స్ పాత్రలో హారిసన్ కీలక పాత్ర పోషించాడు. అతను ధరించిన టోపీకి ఎక్కువ ధర పలికింది. ఈ టోపీ అమ్మకంతో సినిమా ప్రేమికులను ఎంతగా ఆకట్టుకుందో తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇటువంటి వేలంపాటలలో చాలా అరుదైన, గౌరవనీయమైన వస్తువులు అందించబడతాయి. ఇవి చలనచిత్రాల జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడమే కాకుండా వాటి చారిత్రక ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తాయి. ఈ టోపీ ఇతర చలనచిత్ర వస్తువులతో పాటు, మంచి ధరలకు అమ్ముడవుతుంది. ఇది చలనచిత్రాలకు సంబంధించిన ప్రతీకాత్మక వస్తువులకు ప్రత్యేక మార్కెట్, విలువను కలిగి ఉందని సూచిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..