Viral: ‘ఆకులో ఆకునై’.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?

దీంతో వీటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది గమనించకుండా అటుగా వెళ్తే పాము కాటుకు గురి కాక తప్పదు. అయితే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన పాముకు సంబంధించిన ఫొటో వైరల్‌ అవుతోంది. ఇషన్‌ షహన్వాస్ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ పాముకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశాడు...

Viral: 'ఆకులో ఆకునై'.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?
Find The Snake
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 20, 2024 | 7:48 AM

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని పాములు బయటకు వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇక భారతదేశంలో కొన్ని వందల రకాల పాములు ఉన్నాయన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిఉంటాయి. కొన్ని పాములు ప్రకృతిలో కలిసిపోయి ఉంటాయి. చెట్ల పొదల్లో, ఎండిన ఆకుల్లో ఇలా అచ్చంగా అలాంటి రంగులను పోలి ఉంటాయి.

దీంతో వీటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది గమనించకుండా అటుగా వెళ్తే పాము కాటుకు గురి కాక తప్పదు. అయితే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన పాముకు సంబంధించిన ఫొటో వైరల్‌ అవుతోంది. ఇషన్‌ షహన్వాస్ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ పాముకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశాడు. ఇషన్‌.. వైల్డ్ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌.

Find The Snake

అరుదైన జాతులకు చెందిన జంతువుల ఫొటోలు తీస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా చెట్ల పొదల్లో ఉన్న ఓ పాముకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏదో సాధారణ మొక్కల్లా కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఆకుల నడుమ ఓ సన్నటి పాము దాగి ఉంది కనిపెట్టారా.? ఫొటోను కాస్త జూమ్‌ చేసి చూస్తే పాము ఇట్టే కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పాము కనిపించకపోతే ఓ సారి కింద ఉన్న ఈ వీడియో చూడండి. ఆ పాము మీకే కనిపిస్తుంది.

Snake

ఈ వీడియోను షేర్‌ చేసిన ఇషాన్‌.. భారతదేశంలో ఉన్న అరుదైన పాముల్లో ఇదీ ఒకటని పేర్కొన్నాడు. తనను తాను రక్షించుకునేందుకు ఈ పాము ఇలా చెట్ల పొదల్లో దాక్కుంటుంది. ఈ పామును వైన్‌ జాతికి చెందిన దానిగా చెబుతుంటారు. పశ్చిమ కనుమల్లో ఈ పాములు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ పాము విషపూరితమైందే కానీ, ప్రాణాపాయం మాత్రం ఉండే అవకాశం ఉండదు. తీవ్రమైన నొప్పి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కాటు తీవ్రత ఆధారంగా మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..