Watch Video: ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది.

Watch Video: ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..
Eeluru
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 20, 2024 | 12:08 AM

ఏలూరు: శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది. కాని ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శుభలేఖ ప్రశ్నా పత్రంగా మారింది.

నేటి ఆధునిక ప్రపంచంలో యువత తమ జీవితంలో జరిగే శుభకార్యలను వెరైటీగా అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే తమ వివాహం సందర్బంగా ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్లి శుభలేఖ పెళ్లికూతురుని చేయడం హల్ది, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను తమకు తమ కుటుంబ సభ్యులకు బంధువులకు గుర్తిండిపోయేలా వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Marriage

Marriage

ఇటీవల కాలంలో శుభలేఖలలో తమకు ఇష్టమైన హీరోలు, రాజకీయ నాయకులు ఫోటోలు వేసుకుని వారి దివ్య ఆశీస్సులతో వివాహం జరుపుకున్నట్లు శుభలేఖలు అచ్చు వేయిస్తున్నారు. మరి కొందరు తమకు ఇష్టమైన పార్టీకి ఓటు వేయాలి అంటూ ఆ పార్టీ మేనిఫెస్టోను శుభలేఖలో అచ్చు వేయించారు. బంధువులకు మిత్రులకు పంచిపెట్టడం చూసాం అయితే ఈ నెల 23 న వివాహం చేసుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన టీచర్ ప్రత్యుష తన వివాహం అందరికీ గుర్తుండి పోయేలా ఉండాలని అనుకున్నారు.

పెళ్లి శుభలేఖ నుండి వివాహం వరకు అన్నీ వినూత్నంగా జీవితాంతం మధుర క్షణాలుగా గుర్తిండి పోయేలా ప్లాన్ చేశారు. బంధు మిత్రులకు ఇచ్చే శుభలేఖను వినూత్నంగా ప్రశ్న పత్రం క్రింద రూపందించారు. ఈ ప్రశ్నా పత్రంలో 8 ప్రశ్నలుగా విభజించి సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‎గా అచ్చువేశారు. పెళ్లి శుభలేఖలో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు పేర్లు.. తల్లిదండ్రుల పేర్లు, కల్యాణమండపం, వివాహ ముహూర్తం, సమయం, విందులకు సంబంధించి ప్రశ్న జవాబుతో తీర్చిదిద్దిన శుభలేఖను తీర్చిదిద్దారు.

మొదటి ప్రశ్న పెండ్లి కుమారుడి ఫోటో ఇచ్చి పెండ్లి కుమారుడిని గుర్తించండి అని.. రెండవ పెళ్లి కుమార్తె పేరు ప్రత్యూష ఇంగ్లీష్ స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చిన పేరు కరెక్ట్ చేయమని ముద్రించారు. మూడవ ప్రశ్న ఖాళీలను పూరించండి అని పెండ్లి కుమారుడి తల్లి తండ్రుల పేర్లు —– అని క్రింద పేర్లు ఇచ్చారు. నాల్గవ ప్రశ్న కళ్యాణం ఎవరు చేస్తున్నారు.. అని ఐదు, ఆరవ ప్రశ్నలు మల్టీపుల్ ఛాయస్ క్వశ్చన్‎లు అచ్చువేశారు. పెళ్లి ఏ తేదీన, పెండ్లి సమయం ఎప్పుడు అని ఎనిమిదోవ ప్రశ్నను.. కళ్యాణం ఎక్కడ అని ప్రశ్నలు ప్రింట్ చేయించారు. జవాబులు ఇచ్చి 100/100 మార్కులు అని కూడా ఇచ్చారు.

సాధారణ శుభలేఖలో వరుడు, వధువు పేర్లు వారి తల్లి తండ్రులు, పెళ్లి ముహూర్తం, సమయం, కల్యాణ మండపం, విందు అన్నీ వరుసగా అర్ధం అయ్యేలా అచ్చు వేయిస్తారు. కానీ ఈ టీచర్ తమ స్కూల్‎లోని పిల్లలకు క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేసి చేసి తన బంధువులకు, మిత్రులకు కూడా పెళ్లి శుభలేఖను క్వశ్చన్ పేపర్ లా రూపొందించారు. ఈ వినూత్న ప్రశ్న పత్రం శుభలేఖను అందుకున్న బంధుమిత్రులు అందరూ ఆసక్తిగా చూస్తూ పెండ్లి కుమార్తెను అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం