China Rains: చైనాలో భారీ వర్షాలు.. జిక్సింగ్ నగరంలో 50మంది మృతి, 15 మంది మిస్సింగ్.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు

టైఫూన్ గేమీ తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా జిక్సింగ్ సిటీలో 1,700కు పైగా గృహాలు నేలకూలాయి. 65,000కి పైగా కొండచరియలు విరిగిపడి కూలిపోయాయి. భారీ వర్షాలు లోతట్టు నగరమంతటా విధ్వంసం సృష్టించడంతో 23,419 మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిక్సింగ్‌లోని అన్ని ప్రభావిత ప్రాంతాలలో సాధారణంగా రహదారి యాక్సెస్, విద్యుత్, కమ్యూనికేషన్, నీటి సదుపాయం పునరుద్ధరించబడ్డాయి.

China Rains: చైనాలో భారీ వర్షాలు.. జిక్సింగ్ నగరంలో 50మంది మృతి, 15 మంది మిస్సింగ్.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు
China Rains
Follow us

|

Updated on: Aug 20, 2024 | 8:14 AM

సెంట్రల్ చైనాలో జూలై చివరి నుండి భారీ కురుస్తున్నాయి. దాంతో.. నగరాలకు నగరాలే చెరువులుగా మారాయి. కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. హునాన్ ప్రావిన్స్‌లోని జిక్సింగ్ నగరంలో కురుస్తోన్న కుండపోత వర్షానికి యాభై మంది మరణించినట్లు, 15 మంది తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. చైనాలోని చంగ్‌షాలో కుండపోత వర్షం పడడంతో అక్కడి రైల్వే స్టేషన్‌తోపాటు సబ్‌వే నీట మునిగింది. భారీ వరద పోటెత్తండంతో కార్లు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అయితే.. భారీ వర్షాలతో వరద పోటెత్తినప్పటికీ చంగ్‌షా పరిధిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కేవలం రవాణా, ప్రజా వ్యవస్థ స్తంభించినట్లు వెల్లడించారు. సాధారణ స్థితులకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అటు.. సాధారణ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. పరిస్థితులను బట్టి.. వెదర్‌ అప్‌డేట్‌ చూసుకుని మాత్రమే జర్నీలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

చైనా లియానింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్‌లో వరద నీటిలో కొట్టుకుపోతూ బస్సు కింది చిక్కుకుని తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందరూ చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు తండ్రీకూతురు. వరద నుంచి బయటపడేందుకు కూతుర్ని రక్షించేందుకు తండ్రి విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే.. వరదలో కొట్టుకుపోతూనే.. కూతుర్ని కాపాడుకునేందుకు శ్రమించాడు. కానీ.. దురదృష్టవశాత్తు.. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆగి ఉన్న బస్సు కింద చిక్కుకుని ప్రాణాలు విడవడం కలచివేచింది.

టైఫూన్ గేమీ తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా జిక్సింగ్ సిటీలో 1,700కు పైగా గృహాలు నేలకూలాయి. 65,000కి పైగా కొండచరియలు విరిగిపడి కూలిపోయాయి. భారీ వర్షాలు లోతట్టు నగరమంతటా విధ్వంసం సృష్టించడంతో 23,419 మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిక్సింగ్‌లోని అన్ని ప్రభావిత ప్రాంతాలలో సాధారణంగా రహదారి యాక్సెస్, విద్యుత్, కమ్యూనికేషన్, నీటి సదుపాయం పునరుద్ధరించబడ్డాయి. విపత్తు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ ఏడాది వరద సీజన్‌ ప్రారంభం నుంచి చైనాలోని 25 ప్రధాన నదుల్లో వరదలు సంభవించాయి. దాదాపు 25 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలు సంభవించినట్లుగా చైనా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. భారీ వర్షాలతో వరదల బీభత్సం కొనసాగుతోందన్నారు. ఈ ఏడాదిలో దక్షిణ చైనాలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని చెప్పారు. ఫలితంగా.. చైనాలోని 30 నదులు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహించినట్లు తెలిపారు. మొత్తంగా… గతంలో ఎప్పుడు లేని విధంగా చైనాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..

చైనాలో భారీ వర్షాలు జిక్సింగ్ నగరంలో 50మంది మృతి 15మంది మిస్సింగ్
చైనాలో భారీ వర్షాలు జిక్సింగ్ నగరంలో 50మంది మృతి 15మంది మిస్సింగ్
అప్పుడే ఓటీటీలోకి వరుణ్ సందేశ్ 'విరాజి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
అప్పుడే ఓటీటీలోకి వరుణ్ సందేశ్ 'విరాజి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
పోస్టల్‌ శాఖలో 44,228 పోస్టులు.. AP, తెలంగాణ మెరిట్‌ లిస్ట్‌ ఇదే
పోస్టల్‌ శాఖలో 44,228 పోస్టులు.. AP, తెలంగాణ మెరిట్‌ లిస్ట్‌ ఇదే
మంకీపాక్స్‌పై వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ సమీక్ష
మంకీపాక్స్‌పై వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ సమీక్ష
కొడుకుతో కలిసి పూజలు అందుకుంటున్న హనుమంతుడు.. ఆలయం ఎక్కడ ఉందంటే
కొడుకుతో కలిసి పూజలు అందుకుంటున్న హనుమంతుడు.. ఆలయం ఎక్కడ ఉందంటే
'ఆకులో ఆకునై'.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?
'ఆకులో ఆకునై'.. ఈ ఫొటోలో ఓ పాము ఉంది కనిపెట్టగలరా.?
'APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే'
'APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే'
మాయ లేడీ.. నమ్మారో మీ ఇల్లు ఖాళీ
మాయ లేడీ.. నమ్మారో మీ ఇల్లు ఖాళీ
'ఆ వదంతులను నమ్మవద్దు'.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్
'ఆ వదంతులను నమ్మవద్దు'.. ఆస్పత్రి నుంచి సింగర్ సుశీల డిశ్చార్జ్
చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
చికెన్‌ స్కిన్‌తో తింటే మంచిదా, కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..