Sri Janmashtami: కృష్ణుడు ఏలిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. సుందరంగా ముస్తాబైన ఆలయాలు
ద్వారక భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో ఉంది. ఇక్కడ జన్మాష్టమి పండుగ చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలనుకుంటే జన్మాష్టమి రోజున ద్వారకకు తప్పకుండా వెళ్ళాల్సిందే.. కన్నయ్య దర్శనం కోసం లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ తేదీన జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నయ్య ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ పండుగ సంబరాలను మధుర, బృందావన్ నుంచి ఇస్కాన్ వరకు విభిన్నమైన వాతావరణాన్ని.. వేడుకల వైభవాన్ని చూడవచ్చు. అయితే శ్రీ కృష్ణుడు ఏలిన నగరమైన ద్వారకలో మాత్రం అన్ని ఆలయాలకు భిన్నంగా వేడుకలు జరుగుతాయి.
జన్మాష్టమికి కొన్ని రోజుల ముందుగానే ద్వారకను అందంగా అలంకరించారు. ముక్తి నగరంగా పిలువబడే ద్వారక నవ వధువు కంటే తక్కువ కాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమిని శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిధిని జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ద్వారకలో కృష్ణ జన్మోత్సవం ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం..
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
చాలా రోజుల ముందే సన్నాహాలు ప్రారంభం
ద్వారక భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో ఉంది. ఇక్కడ జన్మాష్టమి పండుగ చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలనుకుంటే జన్మాష్టమి రోజున ద్వారకకు తప్పకుండా వెళ్ళాల్సిందే.. కన్నయ్య దర్శనం కోసం లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
నగల అలంకరణ
కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విగ్రహాన్ని విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. రాత్రి ఆభరణాలతో అలంకరించి దాదాపు అరగంట తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ భక్తులు దర్శించలేరు. రాత్రి 12 గంటలకు కన్నయ్య కు స్వాగతం పలుకుతారు. దాదాపు 2 గంటల తర్వాత రాత్రి 2 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
అనంతరం ఉదయం 7 గంటలకు మంగళ హారతితో శ్రీకృష్ణుని పూజలు ప్రారంభమవుతాయి. కన్నయ్యకు భోగ్ సమర్పించి తెరను తొలగిస్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ద్వారకకు వస్తుంటారు. దహీ హండీ, జాయ్ రైడ్‌ల సహా ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి.
ద్వారక ఎలా చేరుకోవాలి
మీరు రైలులో వెళ్లాలనుకుంటే ముందుగా మీరు జమ్నార్‌కు చేరుకోవాలి. ఇక్కడి నుంచి ద్వారకకు 145 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి వచ్చి నేరుగా రైలులో ద్వారకకు చేరుకోవచ్చు. ఇక్కడ సమీప విమానాశ్రయం కూడా జామ్‌నగర్. అదే సమయంలో రాజ్‌కోట్, వడోదర, అహ్మదాబాద్ నుంచి కూడా రైళ్ల ద్వారా ప్రయాణం చేసి ద్వారకకు చేరుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..