Telangana Tourism: ఈ వీకెండ్‌కి ఇలా.. రూ. 800తో సాగర్‌ టూర్‌ ప్యాకేజీ..

కేవలం ఒకటే రోజులో టూర్‌ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana Tourism: ఈ వీకెండ్‌కి ఇలా.. రూ. 800తో సాగర్‌ టూర్‌ ప్యాకేజీ..
Telangana Tourism
Follow us

|

Updated on: Aug 21, 2024 | 7:56 AM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రాజెక్టులను సందర్శిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ! హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉన్న నాగార్జున్‌ సాగర్‌ ఇలాంటి అనుభూతినే అందిస్తుంది. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.

కేవలం ఒకటే రోజులో టూర్‌ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* ఉదయం 7.30 గంటలకు పర్యాటక భవన్‌ నుంచి బస్సు బయలు దేరుతుంది.

* అనంతరం 8 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ వద్ద బస్సు ప్రయాణం మొదలవుతుంది.

* ఉదయం 11.30 గంటలకు నాగార్జున సాగర్‌ చేరుకుంటా.

* 11.40 గంటల నుంచి 12.30 గంటల వరకు బుద్ధవనం ప్రాజెక్ట్ సందర్శన ఉంటుంది.

* ఇక ఆ తర్వాత ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది.

* మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బోటింగ్‌, మ్యూజియం, నాగార్జున కొండ సందర్శన ఉంటుంది.

* సాయంత్రం 4 గంటలకు డ్యామ్‌ సందర్శన ఉంటుంది.

* ఇక సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్‌ నుంచి తిరుగు ప్రయాణం మొదలై.. 9 గంటల వరకు హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

పెద్దలకు రూ. 800, చిన్నారులకు రూ. 640గా నిర్ణయించారు. నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక బోటింగ్‌, ఎంట్రీ, భోజనం వంటివి టూర్‌ ప్యాకేజీలో కవర్ అవ్వవు. టూర్‌ ప్యాకేజీ బుకింగ్, ఇతర పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..