Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 21, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 21, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగాఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కానీ, కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం చీకూచింతా లేకుండా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
బంధుమిత్రులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబంలో ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ప్పటికీ, లాభాలకు లోటుండదు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి లబ్ధిపొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యో గం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి చేపడతారు. వృత్తి జీవితం మంచి మలుపు తిరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందు తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు అను కూల ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలుంటాయి. ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలకు ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఏ పని తలపెట్టినా నిరాటంకంగా పూర్తయి, లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడ తారు. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభి స్తుంది. వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సజా వుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మీ పనితీరు అందరికీ సంతృప్తికరంగా ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన సమస్యలను అధిగమిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో సాదా సీదాగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండదు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి వివదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. బంధువుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ జీవితం సరదాగా, హుషారుగా సాగిపోతుంది. ప్రయాణాలో ఊహించని ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సామాజికంగా గౌరవ మర్యాదలకు కొరత ఉండదు. ఆర్థికపరంగా ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా ఎక్కువ ఫలితం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వినడం జరుగుతుంది.