Money Astrology: శుక్ర, కేతువుల యుతి.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం పక్కా..!

ఈ నెల 24న శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించి, అదే రాశిలో ఉన్న కేతువుతో యుతి చెందడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు సెప్టెంబర్ 18 వరకూ కలిసి ఉండడం జరుగుతుంది. కేతువుతో ఏ గ్రహం కలిసినా విచిత్ర ఫలితాలను, ఆకస్మిక ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఊహించని దిశ నుంచి సహాయ సహకారాలు లభించడం..

Money Astrology: శుక్ర, కేతువుల యుతి.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం పక్కా..!
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 20, 2024 | 6:14 PM

ఈ నెల 24న శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించి, అదే రాశిలో ఉన్న కేతువుతో యుతి చెందడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు సెప్టెంబర్ 18 వరకూ కలిసి ఉండడం జరుగుతుంది. కేతువుతో ఏ గ్రహం కలిసినా విచిత్ర ఫలితాలను, ఆకస్మిక ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఊహించని దిశ నుంచి సహాయ సహకారాలు లభించడం, అంతుబట్టని పరిణామాలు చోటు చేసుకోవడం, అకస్మాత్తుగా డబ్బు కలిసి రావడం వంటివి జరుగుతాయి. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో కలుస్తున్నందువల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య ఏ చిన్నపాటి సమస్య ఉన్నా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఊహించని విధంగా నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది.
  2. సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, కేతువుల యుతి వల్ల ఎంతో కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివా దం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  3. కన్య: ఈ రాశిలో శుక్ర కేతువులు కలుస్తున్నందువల్ల అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. జీవితం అనేక సానుకూల మలుపులు తిరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరు గుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక పదోన్నతికి, ప్రాభవానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారం అవుతుంది. తల్లితండ్రులను కలుసుకో వడం జరుగుతుంది. సామాజికంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, కేతువుల కలయిక వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కూడా అప్రయత్నంగా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూ లవుతాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. ఉద్యో గంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
  5. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, కేతువుల యుతి వల్ల రెండు మూడు సార్లు ధన యోగాలు పట్టే సూచనలున్నాయి. జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి సప్తమంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల దాంపత్యంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. అవివాహితులకు అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగంలో అధికారంతో పాటు ఆదరణ బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.