వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు
ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.

మే 22, 2024 బెంగళూరులోని ఈస్ట్ రామమూర్తినగర్ బాధితురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫెడ్ ఎక్స్ కొరియర్ స్కామ్‌కి కోటి రూపాయల నష్టం. కొరియర్ వచ్చిందంటూ ఫెడ్ ఎక్స్ తరపున ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ పేరున తైవాన్ వెళ్లాల్సిన ఓ కొరియర్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. అక్కడితో ఆగితో ఈ కథలో పెద్ద కిక్కు లేదు. ఆ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. అక్కడ నుంచి కథ కస్టమ్స్‌కి మారింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ మరి కొందరు ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. పార్శిల్‌లో డ్రగ్స్‌తో పాటు పాస్ట్ పోర్టులు, ఇతర వస్తువులు ఉన్నాయని, ఆల్రెడీ విచారణ మొదలైందంటూ భయపెట్టారు. అక్కడితో ఆగలేదు. మరొకరు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఆన్ లైన్లో ఇంటరాగేషన్ పేరుతో భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్‌కు సపోర్ట్ చెయ్యాలని, అందుకోసం ఆర్బీఐకి కొంత డబ్బు పంపాలని, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి విడతల వారీగా కోటీ రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అంతే సడన్‌గా కాల్ కట్టయ్యింది. విచారణ పూర్తయ్యింది. అక్కడితో వారి క్రైం కథా చిత్రం కూడా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కోటి రూపాయలు ఇచ్చేసిన తర్వాత కానీ ఆమెకు తాను మోసపోయానన్న సంగతి తెలియలేదు. ఆ తర్వాత లబో దిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి...