విద్యార్థులతో ఘాట్ రోడ్డు గుంతలోకి దూసుకెళ్ళిన స్కూల్ బస్సు.. ఇంతలోనే..!

స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.

విద్యార్థులతో ఘాట్ రోడ్డు గుంతలోకి దూసుకెళ్ళిన స్కూల్ బస్సు.. ఇంతలోనే..!
School Bus Accident
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Sep 12, 2024 | 5:24 PM

స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి గుంతలోకి దూసుకువెళ్ళింది. ఆ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు.

జమ్మలమడుగు ప్రాంతంలో గల గండికోట ఘాట్ రోడ్‌లో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. గండికోట రోడ్లు ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకు వెళ్లడంతో అందులోని విద్యార్థులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అదే గనక బస్సు మరికొంత స్పీడ్‌గా ముందుకు కదిలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. అందులో ప్రయాణిస్తున్న 25 మంది విద్యార్థులు, డ్రైవర్ తో సహా అందరికీ ప్రాణహాని జరిగి ఉండేది. ఎప్పుడైతే బస్సు గుంతలోకి దూసుకువెళ్తుందో, వెంటనే స్పందించిన డ్రైవర్ కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఏదేమైనా విద్యార్థులు ప్రయాణించే స్కూలు బస్సులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అప్రమత్తంగా డ్రైవర్లు వాటినే నడపాలి. కానీ ఆదమరిస్తే మాత్రం చాలా ప్రమాదం. అలానే ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు స్కూల్ బస్సులను చెక్ చేస్తూ వాటి కండిషన్ పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!