సునీతా-విల్ మోర్ భవితవ్యంపై ఈ రాత్రికి నాసా కీలక రివ్యూ… వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా
రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి.

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి. గతంలో యూఎస్ మిలటరీ స్పేస్‌లో పని చేసిన శాస్త్రవేత్తల మాటలు వింటూ ఉంటే.. అసలు సునీత – విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగొచ్చే అవకాశం ఉందా లేదా.. వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా గతంలో అమెరికా మిలటరీ స్పేస్ సిస్టమ్‌లో పని చేసిన రూడీ రిడాల్ఫీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది. స్టార్ లైనర్ రీఎంట్రీ విషయంలో 3 ప్రమాదకర పరిణామాలు జరిగే అవకాశం ఉందని, ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. నెంబర్ వన్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ ఎలైన్మెంట్ అత్యంత కీలకం అన్నది ఆయన మాట. ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా అనేక దుష్పరిణామాలు జరిగే ప్రమాదం ఉందన్నది ఆయన మాట. Butch Wilmore and Suni Williams పరిమితంగానే ఆక్సిజన్ ఒక వేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పని చేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతే అప్పుడు అందులో...