- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smartphone Oneplus Ace 5 features and price details
One Plus Ace5: వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. కళ్లు చెదిరే ఫీచర్లతో కొత్త ఫోన్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మళ్లీ ప్రీమియం మార్కెట్‌ను టార్గ్ చేస్తోంది. ఇందులో భాగంగానే అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్‌లు వస్తున్నాయి. ఇంతకీ వన్‌ప్లస్ నుంచి వస్తున్న ఆ కొత్త సిరీస్ ఏంటి.? ఎలాంటి ఫీచర్ల ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 24, 2024 | 1:42 PM

వన్‌ప్లస్ వన్‌పల్స్ ఏస్5 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ ఏస్5, వన్‌ప్లస్ ఏస్5 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. చైనాలో ఏ ఏడాది చివరిలో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయిత నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్స్ లీక్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను ఇవ్వనున్నారు.

వన్‌ప్లస్ ఏస్5 ఫోన్‌లో 6.78 ఇంచస్తో కూడిన మైక్రో కర్వ్‌డ్ స్క్రీన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1.5 కే రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ సెటప్‌తో కూడిన కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోనలో 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట చేసే 6200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధరకు సంబంధించి వివరాలు తెలియాల్సిందే. వచ్చే ఏడాది భారత్‌లో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది.





























