తెలంగాణ పాలిటిక్స్‌లో బోయపాటి సినిమా రేంజ్ సీన్లు… తెరమీదకు సడన్ స్టార్లు..!
Kaushik Reddy vs Arekapudi Gandhi: కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ సర్కారు. అదుగో..సరిగ్గా రాజకీయ చిచ్చు అక్కడ మొదలైంది. చిచ్చు సంగతి సరే.. ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చారు. దటీజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి. గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా... ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకుని మొత్తానికి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి.

కష్టంలో ఉన్నప్పుడు కాడి వదిలేస్తున్న నేతలు ఓ వైపు… అవకాశాలు సృష్టించుకొని మరీ ఎదురుదాడి చేసే అధికార పార్టీ మరో వైపు.. పదేళ్ల అధికారం పోయినా లోక్ సభ ఎన్నికల్లోనైనా నాలుగైదు సీట్లు గెలిచి పట్టునిలుపుకుందామనుకున్నారు గులాబీ నేతలు. అయితే సున్నాకి పరిమితం చేసి… కారును షెడ్‌కి పంపించారు ఓటర్లు. గడిచిన పదేళ్లు తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ఇప్పుడు కామ్‌గా ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. అదంతా వ్యూహాత్మక మౌనమన్నది గులాబీ నేతలు చెబుతున్న మాట. కేటీఆర్, హరీశ్ రావు అప్పుడప్పుడూ అలా జనంలోకొచ్చి వెళ్తున్నా.. అధికార పార్టీ దూకుడు ముందు.. రేవంత్ రెడ్డి ఎదురుదాడి ముందు.. ప్రతిపక్షం పాచికలు ఇన్నాళ్లూ పెద్దగా పారలేదు. అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, హరీశ్ రావు వాయిస్ తప్ప.. మరో నేత వాయిస్ వినిపించలేదు. అందుకే ఒక్క అవకాశం కోసం వారు వెయిట్ చేస్తూ వచ్చారు. సరిగ్గా అలాంటి అవకాశం సడన్‌గా వచ్చింది. ఇంతకీ వచ్చిందా.. కాంగ్రెస్ ఇచ్చిందా..? సరే ఈ డిస్కషన్ ఇప్పుడెందుకు లెండి… అసలు కథకు వచ్చేద్దాం. కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ సర్కారు. అదుగో..సరిగ్గా రాజకీయ చిచ్చు అక్కడ మొదలైంది. చిచ్చు సంగతి సరే.. ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చారు. దటీజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి. గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...